అన్వేషించండి

Digvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP Desam

 నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 172 పరుగుల టార్గెట్ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. పంజాబ్ కంప్లీట్ డామినెన్స్ చూపించి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. లక్నో బౌలర్లు ఎవరైనా పంజాబ్ బ్యాటర్ ని ఆడనివ్వకుండా అడ్డుకోగలిగారు అంటే అది కేవలం యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను మాత్రమే.  లక్నో కుర్ర బౌలర్ దిగ్వేష్ రాథీ ప్రియాంశ్ ఆర్యను 8పరుగులకే అవుట్ చేశాడు. ఆర్య ఇచ్చిన క్యాచ్ ను శార్దూల్ ఠాకూర్ పట్టుకోగా...పంత్ ను దాటి దూసుకెళ్లిన దిగ్వేష్ డగౌట్ కు నడుచుకుంటూ వెళ్తున్న ప్రియాంశ్ ఆర్య దగ్గరకు వెళ్లి నోట్ బుక్ సెలబ్రేషన్ చేశాడు. అంటే ఏం లేదు నా వికెట్ల ఖాతాలో నీ పేరు కూడా రాసుకున్నాను పో అని రెచ్చగొట్టడం. ఈ ఐఫీఎల్ తోనే డెబ్యూ చేసిన ప్రియాంశ్ ఆర్య తన ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. గుజరాత్ మీద 23 బాల్స్ లోనే 47 పరుగులు చేశాడు. కానీ రెండో మ్యాచ్ లో ఫెయిల్ అయ్యేప్పటికి ఇలా లక్నో బౌలర్ దిగ్వేష్ రెచ్చగొట్టాడు. ఈ ఇన్సిడెంట్ ను చూసిన అభిమానులు పాత కొహ్లీ ఇన్సిడెంట్ ఒక దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. 2017 లో కరేబియన్ దీవుల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ జరిగితే వెస్టిండీస్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్ అని ఇలానే ఓవరాక్షన్ చేశాడు. కొహ్లీ వికెట్ తీసి తర్వాత కింగ్  దగ్గరకు వచ్చి ఇలా నోట్ బుక్ సెలబ్రేషన్ చేశాడు. దాన్ని గుర్తు పెట్టుకున్న కొహ్లీ 2019లో అంటే రెండేళ్ల తర్వాత సేమ్ వెస్టిండీస్ తో హైదరాబాద్ లో టీ20 జరుగుతున్నప్పుడు విరుచుకపడిపోయాడు. 50 బంతుల్లోనే 94 పరుగులు బాదటంతో పాటు ఆ వెస్టిండీస్ బౌలర్ విలియమ్స్ ను టార్గెట్ చేసి చావగొట్టాడు. బౌండరీ, సిక్స్ కొట్టడం ప్రతీసారి విలియమ్స్ దగ్గరకు వెళ్లి నోట్  బుక్ సెలబ్రేట్ చేయటం స్టార్ట్ చేశాడు కొహ్లీ. అలా తనను రెచ్చగొట్టిన దాన్ని గుర్తు పెట్టుకుని మరీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేశాడు కొహ్లీ. ఇప్పుడు అంత సైలెంట్ గా ఉండే ప్రియాంశ్ ఆర్యను దిగ్వేష్ సేమ్ సెలబ్రేషన్ తో రెచ్చగొట్టాడు. మరి రాబోయే మ్యాచుల్లో ప్రియాంశ్ ఎలా దీనికి కౌంటర్ ఇస్తాడో చూడాలి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget