Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇంటర్నేషనల్ కెరీర్ వైట్ బాల్ ఫార్మాట్‌లో క్రైసిస్ లో ఉంది అనే చెప్పాలి. టెస్టు క్రికెట్‌లో తిరుగులేని మ్యాచ్ విన్నర్‌గా కొనసాగుతున్న పంత్.. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్‌లో మాత్రం తడబడుతున్నాడు. రాబోయే వన్డే ప్రపంచకప్ దృష్ట్యా టీమిండియా మేనేజ్‌మెంట్ బలమైన టీమ్ ను సిద్ధం చేస్తుండగా, 50 ఓవర్ల ఫార్మాట్‌లో పంత్ కనీసం పరిశీలనలో కూడా కనిపించట్లేదు. నిలకడలేని బ్యాటింగ్, కీలక సమయాల్లో నిర్లక్ష్యపు షాట్లే అతడి ఈ పరిస్థితికి కారణమయ్యాయి.
అయితే, పంత్ బ్యాటింగ్ శైలిపై వస్తున్న విమర్శలపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్ చేసారు. పంత్ తన నాచురల్ స్టైల్ ను అస్సలు మార్చుకోవాల్సిన అవసరం లేదని, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా తెలివిగా వ్యవహరిస్తే చాలని స్పష్టం చేశారు. "నేను పంత్‌కు ఎప్పుడూ ఒకే విషయం చెబుతాను.. అతడి వద్ద మంచి ట్యాలెంట్ ఉంది. తన నాచురల్ గేమ్‌ను మార్చుకోవద్దు, కేవలం మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని మరింత తెలివిగా ఆడితే సరిపోతుంది" అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.
వన్డేలు, టీ20లలో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే సమయంలో పంత్ తరచూ సాఫ్ట్ డిస్మిసల్స్‌తో వికెట్ పారేసుకోవడం జట్టుకు శాపంగా మారుతోంది. ఐసీసీ టోర్నీల ముందు మ్యాచ్ అవేర్‌నెస్‌కు మేనేజ్‌మెంట్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటంతో, పంత్ తన ఆటతీరును మార్చుకోకపోతే వైట్ బాల్ టీమ్‌లో మళ్లీ చోటు సంపాదించడం మరింత కష్టంగా మారే అవకాశముంది.
ట్రెండింగ్ వార్తలు






















