అన్వేషించండి

Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?

Janasena PAC Chairman: జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌పై సోషల్ మీడియాలో ప్రచారం వెనుక అసలు నిజాలేంటి? పీఏసీ చైర్మన్ పై కుట్ర చేస్తున్నారా?

Janasena Cadre Trolling Nadendla Manohar:   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ,  ముఖ్యంగా డిజిటల్ స్పేస్‌లో ప్రస్తుతం తీవ్రమైన చర్చకు దారితీస్తున్న అంశం జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ   ఛైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ లక్ష్యంగా సాగుతున్న సోషల్ మీడియా దాడులు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొంతమంది జనసేన సానుభూతిపరులు, అభిమానులు , శ్రేణులు అని చెప్పుకునే నెటిజన్లు నేరుగా నాదెండ్ల మనోహర్‌ను టార్గెట్ చేస్తూ.. ఆయన పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని, లేదా ఆయనను పక్కన పెట్టాలని పోస్టులు పెట్టడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. గతంలో అనేక సందర్భాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందిస్తూ  నాదెండ్ల మనోహర్‌ను ఏమైనా అంటే నన్ను అన్నట్లే, పార్టీ కష్టకాలంలో నిలబడిన శ్రేయోభిలాషి ఆయన అని బహిరంగ వేదికలపై స్పష్టమైన హామీ ఇచ్చినా కూడా.. ఈ ప్రచారం తగ్గకపోవడం వెనుక పెద్ద పొలిటికల్ స్కిట్ నడుస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జనసేనలో నాదెండ్లది ప్రత్యేక స్థానం

నిజానికి, 2019 ఘోర పరాజయం తర్వాత జనసేన ఉనికిని కాపాడుకోవడంలో, క్షేత్రస్థాయిలో పార్టీకి ఒక బలమైన ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ తీసుకురావడంలో నాదెండ్ల మనోహర్ పాత్రను ఎవరూ కాదనలేరు. మాజీ స్పీకర్‌గా ఆయనకున్న రాజకీయ అనుభవం, లీగల్ , అడ్మినిస్ట్రేటివ్ పరిజ్ఞానం పవన్ కళ్యాణ్‌కు ఎంతో ఉపకరించాయి. పార్టీ నాయకులు కార్యకర్తలను సమన్వయం చేయడం, పొత్తుల చర్చల సమయంలో టీడీపీ-బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరపడం వంటి క్లిష్టమైన బాధ్యతలను నాదెండ్ల ఎంతో సైలెంట్‌గా నిర్వర్తించారు. అలాంటి వ్యూహకర్తను ఇప్పుడు ఉన్నపలంగా సొంత పార్టీకి చెందిన నెటిజన్లే నిందించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటనేది ప్రధాన ప్రశ్నగా మారింది.

ఎందుకు పవనే టార్గెట్ !

ఈ టార్గెటింగ్ వెనుక మొదటి ప్రధాన కారణం..  సీట్ల కేటాయింపులు ,  స్థానిక సంస్థల టికెట్ల అసంతృప్తి . కూటమి ప్రభుత్వంలో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించినప్పటికీ, స్థానిక ఎన్నికల్లో  పొత్తుల కారణంగా అనేకమంది క్షేత్రస్థాయి నేతలకు, పోటీ చేయాలనుకున్న ఆశావహులకు సీట్లు దక్కలేదు.   మున్సిపల్, పంచాయతీ, పరిషత్ ఎన్నికలలో కూడా సీట్ల కేటాయింపుల బాధ్యత నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని పిఏసి సమీక్షిస్తుండటంతో.. అవకాశాలు రాని ఆశావహులు తమ కోపాన్ని పవన్ కళ్యాణ్‌పై చూపించలేక, ఆయనకు కుడి భుజంగా ఉన్న నాదెండ్లపైకి మళ్లిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను కలవడానికి లేదా ఆయన వరకు తమ ప్రతిపాదనలు తీసుకెళ్లడానికి నాదెండ్ల మనోహర్ ఒక పెద్ద అడ్డంకిగా మారారని, ఆయన అనుమతి లేనిదే అధినేతను కలిసే అవకాశం దక్కడం లేదని ద్వితీయ శ్రేణి నేతలలో కొంత అసహనం ఉంది. రాజకీయాల్లో పార్టీ అధినేత చుట్టూ ఉండే రక్షణ కవచం వంటి నేతలే ఎప్పుడూ క్యాడర్ ఆగ్రహానికి మొదటి బాధితులవుతుంటారు. ఈ క్రమంలోనే పవన్ కంటే ముందు నాదెండ్ల విమర్శల దాడికి గురవుతున్నారు.

విపక్షాల మైండ్ గేమ్ 

విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,  ఇతర ప్రత్యర్థులు జనసేనను సంస్థాగతంగా బలహీనపరచడానికి  డివైడ్ అండ్ రూల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయనే కోణాన్ని తోసిపుచ్చలేం. నాదెండ్ల మనోహర్‌ను సామాజిక వర్గపరంగా, అలాగే  రైట్ హ్యాండ్  స్థానం నుంచి వేరు చేయగలిగితే.. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న పరిపాలనా వ్యవస్థ, సమన్వయం దెబ్బతింటుందనేది ప్రత్యర్థుల ఆలోచన అయి ఉండవచ్చు. సోషల్ మీడియాలో డమ్మీ ప్రొఫైల్స్ ద్వారా జనసేన కార్యకర్తల పేరిట నాదెండ్లపై నెగెటివ్ ప్రచారం చేయించడం ఈ మైండ్ గేమ్‌లో భాగమని భావిస్తున్నారు. అసలు నాదెండ్ల మనోహర్‌ను పార్టీకి దూరం చేస్తే లేదా ప్రాధాన్యత తగ్గిస్తే ఎవరికి లాభం.. ప్రథమంగా, ఇది జనసేనకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి డిప్యూటీ సీఎంగా  నిరంతరం బిజీగా ఉండే సమయంలో పార్టీ రోజువారీ వ్యవహారాలు చూసే అనుభవజ్ఞుడైన  అడ్మినిస్ట్రేటివ్ ఫేస్  కరువవుతుంది. రెండవది, కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీలతో సత్సంబంధాలు నెరపే సమన్వయకర్త తగ్గిపోతారు. ప్రత్యర్థులకు ఇది చాలా పెద్ద విజయం కాగా, జనసేనలోని కొన్ని అసంతృప్తి వర్గాలకు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు.
 
 సోషల్ మీడియా ట్రోలింగ్స్ ,  అసంతృప్తులు రాజకీయాల్లో సహజమే అయినప్పటికీ, నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్ నాయకుడి విషయంలో క్రమశిక్షణ తప్పడం పార్టీకి నష్టం కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి తన స్పష్టమైన సందేశాన్ని మళ్లీ శ్రేణులకు అందిస్తే తప్ప, నాదెండ్లపై సాగుతున్న ఈ డిజిటల్ ప్రచారానికి తెరపడకపోవచ్చు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
Tamil Nadu CM Vijay TVK MLAs Controversy: సీఎం విజయ్‌కు సొంత ఎమ్మెల్యేల సెగ - 108 మ్యాజిక్ ఫిగర్ భయంతో కన్ఫెషన్ రూమ్ వ్యూహం - పట్టు కోల్పోయారా?
సీఎం విజయ్‌కు సొంత ఎమ్మెల్యేల సెగ - 108 మ్యాజిక్ ఫిగర్ భయంతో కన్ఫెషన్ రూమ్ వ్యూహం - పట్టు కోల్పోయారా?
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KA Paul on Revanth Reddy: నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Nara Lokesh And Upasana: నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Embed widget