అన్వేషించండి

Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?

Teja Sajja Wedding : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తన పెళ్లి పెద్దలు కుదిర్చారని... డిసెంబరులో వివాహం జరగబోతున్నట్లు చెప్పారు.

Teja Sajja Confirms His Wedding In December : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా పెళ్లి పీటలెక్కబోతున్నారు. రెండు రోజుల క్రితం ఆయన పెళ్లిపై ప్రచారం జరగ్గా... తాజాగా స్వయంగా ఆయనే దీనిపై రియాక్ట్ అయ్యారు. త్వరలోనే తన పెళ్లి జరగనున్నట్లు తేజ కన్ఫర్మ్ చేసినట్లుగా నేషనల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

అమ్మాయి ఎవరంటే?

యూఎస్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను తేజ సజ్జా పెళ్లి చేసుకోబోతున్నారు. 'రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా డిసెంబరులో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అంతకంటే ముందు నవంబరులో ఎంగేజ్మెంట్ జరగనుంది. మా పేరెంట్స్ ఈ పెళ్లి కుదిర్చారు. అమ్మాయికి సినిమాలతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్లది బిజినెస్ ఫ్యామిలీ. ఆమె USలోనే పెరిగారు.

నా పర్సనల్ లైఫ్‌ను ప్రైవేట్‌గా ఉంచడానికే ఇష్టపడతాను. అందుకే కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలోనే ఈ పెళ్లి వేడుక చాలా సింపుల్‌గా జరుగుతుంది. ప్రచార ఆర్భాటాలకు దూరంగా సన్నిహితుల మధ్య వేడుకలు జరగాలని నిర్ణయించుకున్నాం.' అని కన్ఫర్మ్ చేశారు.

Also Read : Na Wife Missing OTT : వైఫ్ మిస్సింగ్... అసలు క్రిమినల్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ సందేశ్, శ్వేతా బసు క్రైమ్ థ్రిల్లర్

నవంబరులో ఎంగేజ్మెంట్, డిసెంబరులో పెళ్లి తర్వాత ప్రముఖులు, సెలబ్రిటీల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న తేజ సజ్జా... జాంబీ రెడ్డి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే బిగ్ సక్సెస్ అందుకున్న ఆయన... 'హనుమాన్'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మిరాయ్‌తో హ్యాట్రిక్ విజయం సాధించారు.

ఓ వైపు వరుస సినిమాలతో అలరిస్తూనే మరోవైపు ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఫేమస్ రియాలిటీ షో 'ది ట్రైటర్స్‌'కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 'మిరాయ్ 2'కు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తి చేసిన తేజ సజ్జా... రీసెంట్‌గా 'జాంబిరెడ్డి 2'ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లారు. హనుమాన్ సీక్వెల్ కూడా కంటిన్యూ అవుతోంది. 

Also Read : Psychological Thriller OTT : నిద్రలో నడిచే అలవాటు... కలలు నిజమైతే? - ఓటీటీలోకి వచ్చేసిన రాజు వెడ్స్ రాంబాయి హీరో సైకలాజికల్ థ్రిల్లర్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Varanasi: మహేష్ బాబు అందుకే లుక్ తీయలేదు... 'వారణాసి'లో అదొక్కటీ బాకీ
మహేష్ బాబు అందుకే లుక్ తీయలేదు... 'వారణాసి'లో అదొక్కటీ బాకీ
Pooja Hegde: ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!
ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!
King Release Date: డిసెంబర్ నెలాఖరున 'కింగ్' రిలీజ్... తగ్గేదే లేదంటున్న షారుఖ్ ఖాన్
డిసెంబర్ నెలాఖరున 'కింగ్' రిలీజ్... తగ్గేదే లేదంటున్న షారుఖ్ ఖాన్
Sai Pallavi: నిత్యా రెడ్డిగా సాయి పల్లవి... 'ఓం'లో పవర్ ఫుల్ పోలీసుగా
నిత్యా రెడ్డిగా సాయి పల్లవి... 'ఓం'లో పవర్ ఫుల్ పోలీసుగా
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget