Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌కు ముందు కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీపై ప్రత్యేకంగా కామెంట్స్ చేసారు. వైభవ్‌కు ఫైనల్ టీమ్ లో అవకాశం దక్కితే అడ్డుకోవడం తమ బౌలర్లకు పెద్ద సవాలు అని, అందుకే ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేశామని శాంట్నర్ తెలిపారు.
భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం వైభవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టమని చెప్పినప్పటికీ.. కివీస్ మాత్రం ఈ యువ సంచలనంపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ ఎంతటి విధ్వంసకర బ్యాటింగ్ చేశాడో తాము చూశామని శాంట్నర్ గుర్తుచేశారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ రూపంలో టీమిండియా ఓపెనర్లు బలంగా ఉన్నప్పటికీ, వైభవ్ ఎంత ప్రమాదకర ఆటగాడో తమకు తెలుసని స్పష్టం చేశారు.
ఇక సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గురించీ శాంట్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులు భువీ బౌలింగ్ శైలికి అద్భుతంగా సరిపోతాయని అభిప్రాయపడ్డారు. ఫ్లాట్ పిచ్‌లపైనే బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగల అనుభవం ఉన్న భువీ.. ఇక్కడ పిచ్ నుంచి కాస్త సహకారం లభించినా మరింత ప్రమాదకరంగా మారుతాడని, ఆయనను ఎదుర్కోవడం తమ బ్యాటర్లకు సవాల్ అని పేర్కొన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















