Tirumala News: ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు - చంద్రబాబు కీలక నిర్ణయం
Tirupati: అలిపిరిలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ నిర్మాణ అనుమతుల్ని రద్దు చేస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. ఈ అంశంపై టీటీడీ బోర్డు ఇప్పటికే తీర్మానం చేసింది.

Mumtaz Hotel: తిరుపతిలోని అలిపిరిలో నిర్మిస్తున్న ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ కు చెందిన ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన చంద్రబాబు అనంతరం టీటీడీ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని కొంత మంది సాధువులో పోరాడుతున్నారు. సాధువులు, పీఠాధిపతులు చేసిన పోరాటానికి జడిసి అనుమతులు చంద్రబాబు రద్దు చేశారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దేశం మొత్తం సాధువులు అంతా ఏకం అవుతున్న. తరుణంలో ముంతాజ్ హోటల్ నిర్మాణం అనుమతులు రద్దు చేశారన్నారు.
వైసీపీ హయాంలో దేవలోకం ప్రాజెక్టు రద్దు చేసి ముంతాజ్ హోటల్ కు భూముల కేటాయింపు
మంతాజ్ హోటల్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు, భూముల్ని వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. అత్యంత లగ్జరీగా నిర్మించాలని ఒబెరాయ్ హోటల్స్ నిర్ణయించింది. టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ఇరవై ఎకరాలను వైసీపీ ప్రభుత్వం ఒబెరాయ్ గ్రూప్‌నకు కేటాయించింది. 90 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. రూ. 250 కోట్ల పెట్టుబడితో హోటల్ నిర్మాణానికి ముంతాజ్ గ్రూప్ హోటల్స్ పనులు ప్రారంభించింది. పునాదులు పడ్డాయి. కానీ తర్వాత నిర్మాణ పనులు స్లో అయ్యాయి. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి.
ముంతాజ్ హోటల్ వల్ల భక్తుల మనోభావాలకు ఇబ్బంది
అక్కడ ముంతాజ్ హోటల్స్ అనే బోర్డు ఉండేది. దీంతో అలిపిరి వద్ద ముంతాజ్ పేరు ఏమిటని హిందూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హోటల్ పేరు ముంతాజ్ అని ఉంటుందో లేదో కానీ ఈ కంపెనీ ఒబెరాయ్ గ్రూప్ సబ్సిడరీ. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ స్థలాన్ని దేవలోకం అనే ప్రాజెక్టుకు కేటాయించారు. తిరుమలకు వెళ్లే భక్తులు మరింత భక్తి తత్వంతో ఉండేలా అక్కడ ప్రసిద్ధ ఆలయాల నమూనాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసిస్టార్ హోటల్‌కు కేటాయించారు.
టీటీడీ బోర్డు మొదటి సమావేశంలోనే తీర్మానం - రద్దు చేస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటన
టీటీడీకి కొత్త బోర్డు ఏర్పాటు చేసిన వెంటనే స్థలాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ అక్కడ దేవలోకం ప్రాజెక్టును చేపట్టాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. తిరుమల,తిరుపతిలో ఎక్కడ చూసినా శ్రీవారి నామమే ఉంటుంది. ఇతర మతాల గుర్తులతో ఎలాంటి వ్యాపారాలు నడవవు. పైగా శ్రీవారి భక్తులతో వ్యాపారం నిర్వహించేందుకు కడుతున్నహోటల్ కు ముంతాజ్ అని పెడితే భక్తులు అంగీకరించరు. అందుకే ప్రభుత్వం కూడా అనుమతుల్ని రద్దు చేయాలని నిర్ణయించింది.
వైసీపీ హయాంలో కేటాయించినా.. అప్పుడు నిర్మాణాలు ప్రారంభమైనా మాట్లాడని వైసీపీ నేతలు ఇప్పుడు చంద్రబాబు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటాయించరన్న సంగతి గుర్తుంచుకోవాలని టీడీపీ వర్గాలంటున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

