అన్వేషించండి
Lakshmi Narasimha Swamy Brahotsavam: కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
Satya Sai District: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణమహోత్సవం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు.

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
1/7

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇలపై వెలసిన మహా విష్ణువు ప్రతిరూపం కదిరి శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
2/7

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీన అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు వైభవంగా సాగనున్నాయి.
3/7

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన స్వామివారి కల్యాణమహోత్సవంలో మంత్రి పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
4/7

ఈ సందర్భంగా వేదపండితులు వసంత వల్లభుడికి మంత్రి నారా లోకేష్‌తో సంకల్పం చేయించారు. ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.
5/7

అంతకుముందు శ్రీఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
6/7

మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని పార్టీశ్రేణులు పెద్దఎత్తున బాణసంచా కాల్చారు.
7/7

ఈ కార్యక్రమంలో రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి,ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Published at : 11 Mar 2025 12:09 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion