Viral News: ఆ ప్రొఫెసర్ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు - అన్నీ విద్యార్థులతోనే - ఇతను గురువేనా ?
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రొఫెసర్ కీచకావతారం ఎత్తాడు. విద్యార్థులందర్నీ లోబర్చుకుని లైంగిక అవసరాలు తీర్చుకున్నాడు. కానీ పాపం పండింది.

Professor Crime: గురువు అంటే గౌరవనీయమైన స్థానంలో ఉంటాడు. కానీ ఆ గురువు దారి తప్పితే మాత్రం విద్యార్థులకు పెను ప్రమాదం. అలాంటి ఓ గురువు ఉత్తరప్రదేశ్ లో విద్యార్థినుల పాలిట కీచకుడిగా మారాడు. ఎంతగా అంటే పరీక్షల్లో మార్కులు వేస్తానని..లేకపోతే పనిష్మెంట్ ఇస్తానని చెప్పి బెదిరించి.. వందల మంది విద్యార్థుల్ని లోబర్చుకున్నాడు. ఆ వీడియోలను తన ఫోన్ లోనే భద్రపర్చుకున్నాడు. కానీ పాపం పండటానికి ఎంతో కాలం పట్టలేదు.
యూపీలో ఓ ప్రొఫెసర్ కీచకం
ఉత్తరప్రదేశ్ లోని హాధ్రాస్‌లో ఓ కాలేజీలో రజనీష్ కుమార్ అనే జియాలజీ ప్రొఫెసర్ పని చేస్తున్నారు. ప్రొఫెసర్ పై ఇటీవల ఓ పోలీసులు కేసు నమోదు అయింది. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇలా కేసు నమోదు అయిందని తెలియగానే ప్రొఫెసర్ పరారయ్యాడు. వెంటనే పోలీసులు ఆయన కోసం వెదికి ప్రయాగరాజ్ లో ఉండగా పట్టుకున్నారు.
ఓ విద్యార్థిని ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన అరాచకాలు
నిజానికి అప్పటికి అతను ఒక్క విద్యార్థిని మాత్రమే వేధించాడని అనుకున్నారు. ఆ ప్రొఫెసర్ ఫోన్ తీసుకున్న తర్వాత కానీ ఆయన ఎందుకు పారిపోయాడో అర్థం కాలేదు. ప్రొఫెసర్ ఫోన్ నిండా వీడియోలే ఉన్నాయి. అవన్నీ ఆయన డౌన్ లోడ్ చేసుకున్నవి కావు. తన విద్యార్థులను లైంగికంగా వేధించిన వీడియోలు. దీంతో పోలీసులు అసలు ఏం జరిగిందో మొత్తం బయటకు లాగారు.
2009 నుంచి ఇప్పటి వరకూ వంద మంది విద్యార్థినులపై లైంగిక దాడి
హథ్రాస్‌లోని సేఠ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కాలేజీ చీఫ్ ప్రొక్టర్ ప్రస్తుతం పని చేస్తున్న రజనీష్ కుమార్ 2009లో తొలి సారి ఓ విద్యార్థినిని లోబర్చుకున్నాడు. మంచి మార్కులు వేస్తానని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతే కాదు దాన్ని వెబ్ కెమెరాలో రికార్డు కూడా చేశాడు. ఆ పేరుతో ఆ అమ్మాయిని బెదిరించి చాలా కాలం లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇదేదో బాగుందనుకుని అప్పట్నుంచి..తన వలలో పడే విద్యార్థినులను ఇలాగే లైంగికంగా వేధించి రికార్డు చేసుకోవడం ప్రారంభించాడు. అందర్నీ బెదిరిస్తూండటంతో జీవితాలు పాడైపోతాయని అందరూ.. తమ వేధింపుల గురించి ఎవరికీ చెప్పకుండా చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోయేవారు.
వైవాహిక జీవితంలోనూ వివాదాలే
పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని విద్యార్థులు, వారు తల్లిదండ్రుల నుంచి డబ్బులు కూడా వసూలుచేశాజడు. లైంగిక దాడి దృశ్యాలను రికార్డు చేయడానికి కంప్యూటర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేశాడని హథ్రాస్ పోలీసులు ప్రకటించారు. నిందితుడికి 1996లో పెళ్లైనప్పటికీ ప్రస్తుతం వైవాహిక జీవితం సక్రమంగా లేదని, వారికి పిల్లలు లేరు. ఈ కీచక గరువును కటకటాల్లోకి పంపారు పోలీసులు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

