OTT Crime Drama: బంగారు చైన్ కేసు లాగితే ఆత్మహత్యల డొంక కదిలే మలయాళ క్రైమ్ థ్రిల్లర్... ఓటీటీలోకి 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ', స్ట్రీమింగ్ షురూ
Officer On Duty OTT : మలయాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' ఈరోజే ఓటీటీలో అడుగు పెట్టింది. నెట్ ఫ్లిక్స్ తాజాగా ఓ కొత్త పోస్ట్ తో మూవీ స్ట్రీమింగ్ అవుతోందన్న విషయంపై అప్డేట్ ఇచ్చింది.

రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన మలయాళం మిస్టరీ థ్రిల్లర్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగునాట థియేటర్లలో రిలీజ్ అయి పట్టుమని ఆరు రోజులు కూడా కాకుండానే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కావడం విశేషం. 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' మూవీ మార్చి 20 నుంచి... అంటే ఈరోజే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్ ఫ్లిక్స్ లో 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' స్ట్రీమింగ్
కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన మలయాళ మర్డర్ మిస్టరీ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'. ఈ ఏడాది ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ అంచనాలను అందుకోవడమే కాదు భారీగా కలెక్షన్లను తెచ్చిపెట్టింది. 12 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దీంతో మోస్ట్ అవైటింగ్ మూవీ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేశారు మూవీ లవర్స్. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలో అడుగు పెట్టింది. మార్చ్ 20 నుంచి సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ముందుగానే నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. తాజాగా మరోసారి "ఆఫీసర్ అడుగు పెడితే నేరాలు బయట పడతాయి ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో మలయాళ, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' స్ట్రీమింగ్ అవుతుంది" అంటూ మరో స్పెషల్ పోస్ట్ తో ఓటీటీ మూవీ లవర్స్ ని అలర్ట్ చేసింది నెట్ ఫ్లిక్స్.
అసలు 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' కథ ఏమిటంటే...
నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ హరి శంకర్. అతని దగ్గరికి ఒక బంగారు గొలుసు మిస్సింగ్ కేసు వస్తుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలోనే మరో పోలీస్ ఆఫీసర్ హత్య కేసు, దానితో ఆయన పెద్ద కూతురు సూసైడ్ కేసు కనెక్ట్ అవ్వడంతో కథ టర్న్ అవుతుంది. ఈ బంగారు చైన్ కి ఆ రెండు కేసులకు ఉన్న కనెక్షన్ ఏంటి ? అనే విషయాన్ని హరిశంకర్ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ నేపథ్యంలోనే మూడు కేసులకు ఉన్న లింక్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కనిపెడతాడు. ఇంతకీ వారిద్దరి ఆత్మహత్యల వెనక ఉన్న వ్యక్తి ఎవరు? ఆ రెండు ఆత్మహత్యలకు, ఈ బంగారు గొలుసుకున్న లింక్ ఏంటి? అనేది 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' మూవీ స్టోరీ. జీ
థియేటర్లలో రిలీజైన 6 రోజుల్లోనే ఓటీటీలోకి...
జీతూ ఆష్రాప్ రూపొందించిన ఈ మూవీ ఓటీటీలో కంటే ముందు తెలుగులో కూడా డబ్ అయ్యింది. మలయాళంలో ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి టాక్ రావడంతో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా తెలుగులో డబ్ చేసి, మార్చి 7న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ మార్చ్ 14న 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. అంతకంటే ముందే ఓటీటీ ప్లాట్ఫామ్ తో కుదుర్చుకున్న డీల్ ప్రకారం ఈ మూవీ మార్చ్ 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో మలయాళంతో పాటు అన్ని భాషల్లోనూ రిలీజ్ అయింది. అలా థియేటర్లలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే ఈ మూవీ తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావడం గమనార్హం.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

