Nidhhi Agerwal 'నేను మంచిదాన్ని కాబట్టి అందరూ నాతో మంచిగానే ఉంటారు' - ఓ మూవీలో ఆ కండిషన్ చూసి ఆశ్చర్యపోయానన్న నిధి అగర్వాల్
Hari Hara Veera Mallu Actress: సోషల్ మీడియాలో హద్దులు దాటి కామెంట్స్ చేయడం సరికాదని హీరోయిన్ నిధి అగర్వాల్ అన్నారు. తాజాగా, ఆమె ఓ ఇంటర్వ్యూలో తన మూవీస్‌తో పాటు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Nidhhi Agerwal Comments About Cyber Bullying And No Dating Clause: తాను మంచిదాన్ని కాబట్టే అందరూ తనతో మంచిగా ఉంటారని.. ప్రముఖ నటి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) అన్నారు. అయితే, తన గురించి మంచిగానే మాట్లాడుకుంటారు అనుకుంటే కుదరదని.. కొంతమంది చెడుగానూ మాట్లాడతారని చెప్పారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన రాబోయే చిత్ర విశేషాలతో పాటు కెరీర్ తొలినాళ్లలో ఓ మూవీ టీం పెట్టిన కండిషన్ గురించి కూడా వివరించారు.
ఆ కండిషన్ చూసి ఆశర్యపోయా..
బాలీవుడ్ మూవీ 'మున్నా మైకేల్'తో సినీ పరిశ్రమలో తన కెరీర్ మొదలైనట్లు నిధి చెప్పారు. 'టైగర్ ష్రాఫ్ హీరోగా నటించారు. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత మూవీ టీం ఓ కాంట్రాక్టుపై సంతకం చేయించుకుంది. సినిమాకు సంబంధించిన నేను పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో ఉన్నాయి. అందులో 'నో డేటింగ్' అనే కండిషన్ పెట్టారు. సినిమా పూర్తయ్యే వరకూ ఏ హీరోతో డేట్ చేయకూడదనే షరతు విధించారు. కాంట్రాక్ట్ మీది సంతకం చేసినప్పుడు నేను పెద్దగా ఇవన్నీ చదవలేదు. ఆ తర్వాత విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. నటీనటులు లవ్‌లో ఉంటే వర్క్‌పై దృష్టి పెట్టరని భావించి ఆ టీమ్ ఈ కండిషన్ పెట్టుండొచ్చు.' అని తెలిపారు.
Also Read: తెలుగులో 'ధనుష్' హాలీవుడ్ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా.?
అలాంటి కామెంట్స్ కరెక్ట్ కాదు..
ఈ ప్రపంచంలో మంచి, చెడు రెండూ ఉంటాయని.. కేవలం మాత్రమే ఉందనడానికి వీల్లేదని నిధి అన్నారు. 'మంచి లేదా చెడు ఏదైనా సరే చెప్పడానికి ఓ పద్ధతి ఉంటుంది. హద్దులు దాటి.. అసభ్యపదాలు ఉపయోగిస్తూ కామెంట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. సోషల్ మీడియా కామెంట్స్ నాపై పెద్దగా ప్రభావం చూపవు. కానీ, అందరూ నాలా ఉండరు. ఇలాంటి కామెంట్స్ చూసి వారు బాధ పడుతుంటారు. అలాంటి వారిని గ్రహించి మర్యాదపూర్వకంగా కామెంట్స్ చేస్తే బాగుంటుంది.' అని అన్నారు.
హరిహర వీరమల్లు కోసం వెయిటింగ్..
తెలుగులో నాగచైతన్య 'సవ్యసాచి' మూవీతో హీరోయిన్ నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని సినిమాలు చేశారు. ప్రస్తుతం.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ప్రభాస్ 'రాజాసాబ్' మూవీలో నటిస్తున్నారు.
పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న 'హరిహర వీరమల్లు' మూవీ మే 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అటు పవన్ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ 'రాజాసాబ్'లోనూ నిధి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏప్రిల్ 10న మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ తొలుత భావించగా.. ఇప్పుడు మూవీ వాయిదా పడుతుందనే రూమర్స్ వస్తున్నాయి. ఆగస్ట్ మధ్యలో మూవీ రిలీజ్ చేయాలని టీం నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

