KGBV Admissions: గుడ్‌న్యూస్, కేజీబీవీలో ప్రవేశాలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి..
కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయలో ప్రవేశాలకు దరఖాస్తులకు నోటిఫికేషన్ వెలువడింది.. 6, 11 తరగతులతోపాటు 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకు దరఖాస్తులు స్వీకరించనున్నారు..

కేజీబీవీలో ప్రవేశాలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి..
కస్తూర్భ గాంధీ బాలిక విద్యాలయలో తమ పిల్లల్ని చదివించుకోవాలని చూసే తల్లితండ్రులకు గుడ్‌న్యూస్.. 2025`26 విద్యాసంవత్సరానికి గాను 6,11 తరగతుల్లో ప్రవేశాలకోసం, 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు సమగ్ర శిక్ష ఎస్బీడీ బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీలో 352 కస్తూర్భ గాంధీ బాలిక విద్యాలయాలు ఉండగా అయిదో తరగతి పూర్తిచేసుకుని అయిదో తరగతిలో చేరగోరేవారు, పదోతరగతి పూర్తిచేసుకుని 11 తరగతిలో చేరేవారు లక్ష్యంగా ఈ నోటిఫికేషన్ వెలువరించారు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 22 నుంచి ఏప్రిల్ 11 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
దరఖాస్తు చేసుకునేందుకు నిబంధనలు ఇవి..
కేజీబీవీల్లో ప్రవేశాల అందరికీ కాదు.. అనాధలు, బడిబయట పిల్లలు, డ్రాపౌట్స్(మద్యలో బడి మానేసినవారు). పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీపీఎల్ పరిధిలో ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంది.. కేవలం ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణనలోకి తీసుకుంటారు.
దరఖాస్తులు ఈ వెబ్‌సైట్‌ద్వారా చేసుకోవచ్చు..
కేజీబీవీల్లో ప్రవేశాలు పొందగోరు విద్యార్ధినిలు http://apkgbv.apcfss.in/ సైట్ ద్వారా దరఖాస్తు పొందవచ్చు. కేవలం ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారానే దరఖాస్తు పూర్తిచేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు. అంతే కాకుండా దరఖాస్తు చేసుకున్నసమయంలో ఎంపిక చేసుకున్న సంబందిత పాఠశాల నోటీసు బోర్డులో కూడా నేరుగా చూడవచ్చు. ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే 70751 59996, 70750 39990, 70750 39990 అను ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

