The Extraordinary Journey Of The Fakir Telugu OTT: తెలుగులో 'ధనుష్' హాలీవుడ్ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా.?
Dhanush Hollywood Movie: కోలీవుడ్ స్టార్ ధనుష్ హాలీవుడ్ ఫస్ట్ మూవీ 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' తెలుగులో ఓటీటీలోకి రానుంది. ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.

Dhanush's Hollywood Movie The Extraordinary Journey Of The Fakir Telugu OTT Release On Aha: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' (The Extraordinary Journey Of The Fakir). 2019లో విడుదలైన ఈ మూవీ దాదాపు ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే 'యాపిల్ టీవీ+' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా తాజాగా తెలుగు ఓటీటీ 'ఆహా'లోనూ (Aha) అందుబాటులోకి రానుంది.
తెలుగులో స్ట్రీమింగ్..
ఈ చిత్రాన్ని తెలుగులో తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇప్పటికే 'ఆహా' ప్రకటించగా.. తాజాగా రిలీజ్ డేట్‌ను ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఈ నెల 25 నుంచే చూడొచ్చని తెలిపింది.
View this post on Instagram
స్టోరీ ఏంటంటే..?
రొమైన్ ప్యుర్తోలస్ రాసిన 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్: హూ ట్రాప్డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్ రోబ్' అనే ఫ్రెంచ్ నవల ఆధారంగా కెన్ స్కాట్ ఈ మూవీని తెరకెక్కించారు. హాలీవుడ్ నటులు బెన్ మిల్లర్, ఎరిన్ మోరియాట్రి తదితరులు మూవీలో కీలక పాత్రలు పోషించారు. ముంబయికి చెందిన అజాతశత్రు అలియాస్ లవశ్ పటేల్ (ధనుష్) స్ట్రీట్ మెజీషియన్‌గా చేస్తుంటాడు. తనకు మ్యాజికల్ పవర్స్ ఉన్నాయంటూ అందరికీ కథలు చెబుతూ కాలక్షేపం చేస్తుంటాడు.
తల్లి చనిపోయిన తర్వాత పారిస్‌లో ఉండే తండ్రి ఆచూకీ వెతికేందుకు వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయిని ఇష్టపడతాడు. ఇదే టైంలో ఊహించని పరిస్థితుల్లో ఐకియా వార్డ్ రోబ్‌లో చిక్కుకుంటాడు. చివరకు అతను ఎలా దాని నుంచి బయటపడ్డాడు..?, తన తండ్రిని కలిశాడా.. లేదా..? ఇష్టపడిన అమ్మాయికి తన ప్రేమ సంగతి చెప్పాడా.?, అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మూవీలో ధనుష్ నటనకు హాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.
ధనుష్ 'ఇడ్లీ కడై' పోస్ట్ పోన్..?
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ధనుష్ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. ప్రస్తుతం ధనుష్.. 'కుబేర', 'ఇడ్లీ కడై'తో పాటు ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'కుబేర'లో నాగార్జునతో కలిసి ధనుష్ నటిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్. అలాగే, ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తోన్న హిందీ మూవీ 'తేరే ఇష్క్ మే'లోనూ ధనుష్ నటిస్తున్నారు. మరోవైపు.. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌లోనూ నటిస్తున్నారు.
'ఇడ్లీ కడై' మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుందని ఎప్పుడో ప్రకటించగా.. విడుదల వాయిదా పడొచ్చనే టాక్ వినిపిస్తోంది. అజిత్ కొత్త మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కారణంగా వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

