Viral Video: నచ్చిన కలర్ రిబ్బన్ పెట్టలేదని అధికారిని కొట్టిన ఎమ్మెల్యే - వైరల్ గా మారిన వీడియో
MLA Samsul: ఆయన ఎమ్మెల్యే. ఓ అభివృద్ధి పని శంకుస్థాపనకు వచ్చారు. రిబ్బన్ కట్ చేయాల్సి ఉంటే ఆ కలర్ తనకు నచ్చలేదని అధికారిపై దాడి చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Assam MLA Samsul Huda: ఎమ్మెల్యేలు అంటే తము ఊడిపడ్డామని అనుకుంటూ ఉంటారు. అందరూ కాకపోయినా కొంత మంది ఆ బాపతు గాళ్లు ఉంటారు. వాళ్ల కళ్లు నెత్తి మీదే ఉంటాయి. తాము గొప్ప అని.. ఎవరైనా తమకు ఇష్టం లేని పని చేస్తే వాళ్లపై దాడి చేయడం తమ హక్కు అనుకుంటారు. అలాంటి వారిలో అస్సాం ఎమ్మెల్యే శామ్యుల్ హుడా ఒకరు.
నాలుగు రోజుల కిందట ఆయన నియోజకవర్గంలో ఓ వంతెన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా వచ్చారు. అది బూమి పూజమాత్రమే.. ప్రారంభోత్సవం కాదు. ప్రారంభోత్సవమే అయితే బ్రిడ్జికే రిబన్లు కట్టి ఉండేవారు. కానీ అది శంకుస్థాపన కట్టి.. మనం పూజల సమయంలో కట్టుకునేలా రెండు అరటి చెట్లను తెచ్చి నిలబెట్టి దానికి రిబ్బన్ కట్టారు. కట్ చేయడానికి ఎమ్మెల్యే శామ్యూల్ వచ్చారు. కట్ చేయడానికి ఆయన కత్తెర కూడా చేతుల్లోకి తీసుకున్నారు. కానీ ఆయన కంటికి రిబ్బన్ పింక్ కలర్‌లో కనిపించింది.
దీంతో ఆయన రెచ్చిపోయారు. పింక్ కలర్ ఎందుకు పెట్టారని రెడ్ కలర్ రిబ్బన్ కదా పెట్టాల్సింది అని రెచ్చిపోయారు. ఇదేమంత విషయం అని చుట్టుపక్కల వారు అనుకుంటారేమో అని కూడా అనుకోలేదు. ఆయన కోపం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. చివరికి రిబ్బన్ కట్టిన అరటి చెట్టు తీసుకుని ఉద్యోగిని బాదేశాడు . ఎమ్మెల్యే ఆగ్రహం చూసి అందరూ ఇదేం అతి అనుకున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
असम के धुबरी जिले के पूर्वी बिलासिपारा विधानसभा से विधायक हैं समसुल हुदा...
— Amit Yadav (Journalist) (@amityadavbharat) March 20, 2025
विधायक जी को एक पुल के शिलान्यास के लिए बुलाया गया था...
विधायक जी को शिलान्यास के लिए फीता काटना था. इसके लिए केले के दो पौधों के बीच एक गुलाबी फीता लगाया गया था...
लेकिन विधायक जी इस बात पर भड़क गए… pic.twitter.com/TXEGBK6WkW
ఎమ్మెల్యేల తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు. ఇంత హెడ్ వెయిట్ కూడదని అంటున్నారు.
Mla सही कर रहे यही है इनकी औकात!बेरोजगारी साफ सफाई बिजली महंगाई के खिलाफ वोट नहीं दोगे और धर्म के नाम पर वोट दोगे तो यही होगा! Very good sir और लगाओ मेरी तरफ से दो!
— Rajsisodia (@Rajsisodia66637) March 20, 2025
Mla सही कर रहे यही है इनकी औकात!बेरोजगारी साफ सफाई बिजली महंगाई के खिलाफ वोट नहीं दोगे और धर्म के नाम पर वोट दोगे तो यही होगा! Very good sir और लगाओ मेरी तरफ से दो!
— Rajsisodia (@Rajsisodia66637) March 20, 2025
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

