AP MLAs Cultural programs: ఏపీ ప్రజాప్రతినిధుల కళాపోషణ అదుర్స్ - సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యేలు - వీడియోలు
Andhra Assmebly: ఏపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ చివరి రోజున తమ కళా ప్రదర్శన చేశారు. రఘురామకృష్ణరాజు కర్ణుడి ఏకపాత్రాభినయం చేశారు.

AP MLAs performance: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు ఆసక్తి ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కళా ప్రదర్శన చేసి అబ్బురపరిచారు. పలు సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నవ్వు ఆపుకోలేకపోయారు.చివరి రోజు సభ వాయిదా పడిన తర్వాత ఏ కన్వెన్షన్ సెంటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
చాలా మంది ముందుగానే రిహార్సల్స్ కూడా చేసుకుని సీరియస్ గా తమ ప్రతిభను ప్రదర్శించారు. కళాభిమానిగా పేరున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు "దాన వీర శూర కర్ణ" సినిమాలోని సూపర్ హిట్ డైలాగ్ ను ఏకపాత్రాభియం ద్వారా చెప్పారు. తర్వాత చంద్రబాబు, పవన్ తో ఫోటోలు దిగారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు.. pic.twitter.com/J7sCV2Ib66
— Bulli Raju (@bullii_raju) March 20, 2025
కందుల దుర్గేశ్ బాలచంద్ర పాత్ర వేసి ఆకట్టుకున్నారు.
#AdminPost
— Kandula Durgesh (@kanduladurgesh) March 20, 2025
"ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కల్చరల్ ఈవెనింగ్" కార్యక్రమంలో భాగంగా గౌరవ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేశ్ గారు 'బాలచంద్ర' పాత్రలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి అందరిని అలరించారు.
సాంస్కృతిక విలువలను ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో… pic.twitter.com/iOkCb041mq
జనసేన ఎమ్మెల్యేలు వేసిన పవన్ కల్యాణ్ పేరడీ స్కిట్ అందర్నీ ఆకట్టుకుంది. చంద్రబాబు, పవన్ తో పాటు అందరూ విపరీతంగా నవ్వారు.
All smiles around @ Andhra Pradesh legislature cultural evening programme.#AndhraPradesh pic.twitter.com/ZE4yVVbgRa
— JanaSena Shatagni (@JSPShatagniTeam) March 20, 2025
Election tarvatha nundi serious face, fans ki class lu..
— Twood Trolls ™ (@TT_2_0) March 20, 2025
Nuv manaspoortiga navvindhi chusi ennallu ayyindhi anna @PawanKalyan 🤩 pic.twitter.com/cuSOu8PwGX
రాజకీయంగా సైటైర్లు వేసుకుంటూ.. నాటకాలను ప్రదర్శించారు. ఆ తర్వాత ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు.
వినుకొండ MLA - మాచర్ల MLA.
— H A N U (@HanuNews) March 20, 2025
వస్తాయి గా ఒక సంవత్సరం లో పంచాయితీ ఎన్నికలు, ఎక్కడికి పోతారో నేనూ చూస్తా 😀 pic.twitter.com/0PFncMLMrL
పదకొండు నెంబరోడు అంటా 🤣🤣 pic.twitter.com/bVrs4ugPkd
— Swathi Reddy (@Swathireddytdp) March 20, 2025
ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీ ఉన్నప్పుడు ఎంత వేడి..వాడి చర్చలు జరిగినా సభ్యుల మానసిక ఉల్లాసం కోసం ఇలాటి కార్యక్రమాలు నిర్వహించేవారు. తర్వాత తగ్గిపోయాయి. చాలా కాలం తర్వాత ప్రజాప్రతినిధులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.
వైసీపీ సభ్యులు ఆటల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను మిస్సయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

