BEL: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Non Executive Recruitment: హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 32 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 9 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 32
⏩ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ(ఈఏటీ): 08 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 03, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 01, ఎస్సీ- 01, ఎస్టీ- 02.
డిసిప్లిన్ /ట్రేడ్: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్.
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి.
వయోపరిమితి: 1.03.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.24,500 - రూ.90,000.
⏩ టెక్నీషియన్ సీ: 21 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 08, ఈడబ్ల్యూఎస్- 03, ఓబీసీ- 05, ఎస్సీ- 04, ఎస్టీ- 01.
డిసిప్లిన్ /ట్రేడ్: ఎలక్ట్రానిక్స్- మెకానిక్.
అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ + ఐటీఐ + ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ+3 సంవత్సరాలు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 1.03.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.21,500 - రూ.82,000.
⏩ జూనియర్ అసిస్టెంట్: 03 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01, ఈడబ్ల్యూఎస్- 01, ఎస్టీ- 01.
డిసిప్లిన్ /ట్రేడ్: బీకామ్/బీబీఎం.
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూషన్/యూనివర్సటి నుంచి బీకామ్/బీబీఎం(మూడేళ్ళ కోర్సు) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 1.03.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.24,500 - రూ.90,000.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250+18% GST. ఎస్సీ/ ఎస్టీ /పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పార్టు I, పార్టు II రెండు విభాగాలు ఉన్నాయి.
పార్టు I: జనరల్ ఆప్టిట్యూడ్(50 మార్కులు - ఇందులో జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ ఆప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్, కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంటాయి).
పార్టు II: టెక్నికల్ ఆప్టిట్యూడ్ (100 మార్కులు - సంబంధిత విభాగం నుంచి 100 నిర్దిష్ట ప్రశ్నలతో కూడిన టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.04.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

