Himachal Viral Video: హిమాలయాల్లో డేంజరస్ డ్రైవింగ్..హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు ఈ వీడియో చూడకండి…
హిమాచల్ ప్రదేశ్ Killar రోడ్డులో ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సు ప్రయాణ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అత్యంత ప్రమాదకరమైన రోడ్డుపైన జరుగుతున్న ఆ బస్సు ప్రయాణం ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది.

Himachal Dangerous Driving: కొండకోనల్లో అద్భుతమైన దృశ్యాలను చూస్తూ థ్రిల్లింగ్ రైడ్ చేయాలని ఎవరికి ఉండదు..? అదీ హిమాలయాల్లో అయితే ఆ ఆనందమే వేరు. బైకుల్లో అయినా బస్సుల్లో అయిన రోడ్లపక్కన పారే నదులను కొండ మలుపుల్లో నుంచి చూస్తూ ఉంటే చాలా థ్రిల్గింగ్ గా ఉంటుంది. అయితే ఈ అద్భుత దృశ్యాల మాటును అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఉంటాయి మొత్తం కొండలు లోయలతో నిండిన హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల ఘాట్‌రోడ్లులో ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అలాంటి చోట్లలో కూడా డ్రైవర్లు ఒడపుగా బండ్లను నడిపించేస్తూ ఉంటారు.
అత్యంత కఠినమైన ములుపుల్లో.. మట్టి దారుల్లో వాళ్లు చేసే డ్రైవింగ్ చూస్తుంటే మనకు పై ప్రాణాలు పైనే పోతుంటాయి. హిమాచల్ అద్భుతమైన సౌందర్యానికి పుట్టిల్లు. అందరూ వెళ్లే ముఖ్యమైన మనాలీ, సిమ్లా వంటి రద్దీ టూరిస్ట్ ప్లేసులు కాకుండా కొంచం లోపలికి వెళితే అసలైన సౌందర్యాన్ని చూడొచ్చు. కొంతమంది రిస్కు చేసి అలాంటి ప్రదేశాలకు వెళుతుంటారు. టూరిస్టు ప్లేసులు కాకుండా హిమాచల్‌లోని గ్రామాలు, చిన్నచిన్న టౌన్లకు వెళ్లడానికి సరైన రోడ్లు ఉండవ్. ఇలాంటి ఆఫ్ రోడ్లపై హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ బస్సును నడిపిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. చూస్తుంటేనే గుండె ఆగినంత పనవుతుంది..
View this post on Instagram
ఓ మారుమూల కొండ వాలు ప్రాంతంలో దాదాపు లోయ అంచున వెళుతున్న బస్సు ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది. ఆ వీడియో చూస్తే.. బస్సు పక్కనే పెద్ద లోయ.. ఎలాంటి రక్షణ గోడలు.. మార్జిన్ లేనటువంటి ఓ రోడ్‌పై వెళ్లాలంటే వణికిపోయేలా ఉంది. ఇది హిమాచల్‌లోని Pangi వ్యాలీని జమ్మూకశ్మీర్‌తో కలిపే రోKishtwar-Killar Road. ఇది ప్రపంచంలోని ప్రమాదకరమైన రహదారుల్లో ఒకటి. అత్యంత సన్నగా ఉండే ఓ మార్గంలో పక్కన చీనాబ్ నది ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా 2వేల అడుగుల లోయలోకి పడిపోవడమే... ఓ కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను పోస్టు చేస్తూ.. హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు ఎక్కుతారా అని తన ఇన్ స్టా ఫాలోయర్స్‌ను అడిగాడు. .
దీనిపై చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేశారు. “హిమాచలీ డ్రైవర్‌లు Ultra Pro max” అని, కొంతమంది ఆ బస్సులో ఎక్కలేమని.. “దీనికన్నా… నడిచివెళ్లడం ఉత్తమం” అని.. డ్రైవర్ మూమూలోడు కాదు అని ఇలా రకరకాలుగా కామెంట్లు వచ్చాయి.
ఇంకో యూజర్ ప్రాణాలు “అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాలని” కామెంట్ చేశాడు.
హిమాచల్ రైడింగ్ అంటే అంతే
హిమాచల్ ప్రదేశ్ మొత్తం ఇలాంటి దుర్గమమైన రోడ్లే ఉంటాయి. చాలా వరకూ ఆఫ్ రోడ్ టూరిస్ట్ స్పాట్లకు బైక్ రైడర్లు మాత్రమే వెళుతుంటారు. ఈ రోడ్ కాకుండా ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ రోడ్లలో ఒకటిగా గుర్తింపు ఉన్న హిందదుస్తాన్ – టిబెట్ NH5 రోడ్డు కూడా ప్రమాదకరమే. Kinaur వ్యాలీ దగ్గర ఇది భయంకరంగా ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

