అన్వేషించండి

Kurnool Baby Punarvika:16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ కోసం 9 నెలల బాలిక పోరాటం! ఇంతకీ ఏంటా సమస్య?

Kurnool Baby Punarvika: పునర్విక శ్రీకి పునర్జన్మ ప్రసాదించాలని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ కోసం సాయం చేయాలని రిక్వస్ట్ చేస్తున్నారు.

Kurnool Baby Punarvika: వైద్య చరిత్రలో కొన్ని వ్యాధులు వినడానికే అరుదుగా ఉంటాయి. కానీ అవి సోకిన కుటుంబాలకు మాత్రం అంతులేని వేదన మిగులుస్తాయి. అటువంటి కోవకు చెందినదే స్పైనర్ మస్క్యులర్ అట్రోఫీ. కర్నూలు జిల్లాకు చెందిన 9నెలల పసికందు పునర్విక శ్రీ ప్రాణం నిలవాలంటే అక్షరాల 16 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ కావాలి. ఒక సామాన్య క్షవర వృత్తి చేసుకునే తండ్రికి ఇది ఆకాశమంత భారమై బిడ్డను కాపాడుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు సేవ్ పునర్విక అంటూ ఏకమవుతున్నారు. 

ఆరు నెలల వరకు అంతా సజావుగానే...

కర్నూలుజిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన జంపాల సురేష్‌ కుమార్, పుష్పవతి దంపతులకు మే 12, 2025న పునర్విక జన్మించింది. పుట్టినప్పుడు 3.5 కిలోల బరువుతో ఆరోగ్యంగానే ఉన్న ఆ చిన్నారి, ఆరు నెలలు దాటినా బోర్లా పడకపోవడం, కనీసం శరీరాన్ని కదలించలేకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. స్థానిక వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమెకు టైప్-1 ఎస్‌ఎంఏ సోకిందని నిర్దారణైంది.

అసలేమిటీ ఎస్‌ఎంఏ

ఇది ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి. వెన్నెముకలోని మోటార్‌న్యూరాన్లు దెబ్బతినడం వల్ల కండరాలకు మొదడు నుంచి అందాల్సిన సంకేతాలు అందవు. దీని వల్లకండరాలు క్రమంగా క్షీణించి, చిన్నారులు కనీసం మెడ నిలపలేకపోవడం, కూర్చోలేకపోవడ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాధి తీవ్రతను బట్టి దీనిని నాలుగు రకాలుగా విభజిస్తారు. 

టైప్‌ వన్‌ ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఆరు నెలల లోపు శిశువుల్లో కనిపిస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం పొంచి ఉంటుంది. ఏడు నుంచి 18 నెలల పిల్లల్లో టైప్‌-2 వ్యాధి వస్తుంది. వీరు కూర్చోగలరు, కానీ నడవలేరు. ఏడాదిన్నర దాటిన పిల్లల్లో టైప్‌-3 వ్యాధి కనిపిస్తుంది. పెద్ద వారిలో టైప్‌ -4 వ్యాధి వస్తుంది. ఇది అంత ప్రాణాంతకం కాదు. 

ఒక్క ఇంజెక్షన్‌ ధర 16 కోట్ల రూపాయలు!

ఈ వ్యాధికి చికిత్సగా అమెరికాకు చెందిన నోవార్టిస్‌ సంస్థ తయారు చేసిన జోల్‌జెన్‌స్మా అనే ఇంజెక్షన్‌ను వాడతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధంగా చెబుతారు. దీని ధర సుమారు 16 నుంచి 18 కోట్ల రూపాయలు ఉండగా, విదేశాల్లో దిగుమతి చేసుకునేటప్పుడు పన్నులతో కలిపితే ఇది దాదాపు పాతిక కోట్ల రూపాయలకు చేరుతుంది. ఇది కేవలం ఒకే ఒక్కోసారి ఇచ్చే 'జీన్‌ థెరపీ' ఇంజెక్షన్. సాధారణ మందులు అయితే జీవితాంతం వాడాల్సి ఉంటుంది. దానికి సుమారు 30 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. 

క్షవర వృత్తి చేసే తండ్రికి అనుకోని కష్టం!

పునర్విక తండ్రి సురేష్‌ వెల్దుర్తిలో ఒక చిన్న షాపు పెట్టుకొని జీవిస్తున్నాడు. వారికి రోజువారీ జీవితం గడవడమే కష్టంగా ఉంది. అలాంటి కుటుంబం 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్‌ తలచుకుంటేనే కాళ్ల కింద భూమి కుంగిపోతోంది. అందుకే కూతుర్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 

జన చైతన్యం- సేవ్ పునర్విక ఉద్యమం

పునర్విక దీనస్థితిపై సోషల్ మీడియా స్పందించింది. తెలుగు రాష్ట్రాల్లోని వారంతా పునర్విక కోసం వీడియోలు, పోస్టులు పెడుతున్నారు. కొన్ని జిల్లాల్లో యువత పాప కోసం ర్యాలీలు తీస్తున్నారు. చిన్నారులు కిడ్డీబ్యాంకులను అందజేస్తున్నారు. 

గతంలోనే మానవత్వం చాటుకున్న ప్రజలు     

తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పోరాటాలు గతంలోనూ జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన చిన్నారి ఆయాన్ష్‌ గుప్తా కోసం దాతలు 16 కోట్లు సేకరించి ప్రాణాలు నిలబెట్టారు. రాజస్తాన్‌ు చెందిన నూర్‌ ఫాతిమ అనే చిన్నారి నిధులు సమకూరే లోపే కన్నుమూసింది. కోయంబత్తూరుకు చెందిన జూహా జైనాబ్ అనే చిన్నారికి అదృష్టవశాత్తు అమెరికా కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో ఉచితంగా ఈ ఇంజెక్షన్ లభించింది. పునర్విక విషయంలో అలాంటి అద్భుతం ఏదైనా జరగాలని అందరూ కోరుతున్నారు. 

సహాయం చేయాలనుకుంటున్న వారు...

చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడాలనుకునే వారు పాప తండ్రి సురేష్‌ ఫోన్ నెంబర్‌ 7799279441 లేదా 9052635529 సంప్రదించవచ్చు. అలాగే ఇంపాక్ట్‌ గురు క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget