Bladder Stones : మూత్రాశయంలో రాళ్లు ఏర్పడడానికి కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది
Bladder Stones Causes : వేసవిలో వచ్చే ప్రధాన సమస్యల్లో బ్లాడర్‌లో రాళ్లు ఒకటి. ఇవి ఎలా వస్తాయి? వాటివల్ల కలిగే ఇబ్బందులు ఏంటో? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Bladder Stones Prevention Tips : సమ్మర్లో బ్లాడర్‌లో స్టోన్స్ సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందులు కలిగిస్తాయి. మూత్రాశయంలో రాళ్లు ఏర్పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో.. అవి ఏర్పడడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాడర్ స్టోన్లో రకాలు (Types of Bladder Stones)
బ్లాడర్ స్టోన్లో రాళ్లు వివిధ రకాలు ఉంటాయి. మూత్రంలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల కాల్షియం స్టోన్స్ ఏర్పడతాయి. ఇవి చాలా సాధారణ రకం. డయాబెటిస్ ఉన్నవారిలో, తగినంత నీరు తాగని వారికి యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయి. సిస్టీన్ స్టోన్స్ (Cystine stones) మరో రకం. ఇవి అరుదుగా వస్తాయి. మూత్రపిండాలను ప్రభావితం చేసే రుగ్మతలు ఉన్నవారికి సిస్టీన్ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి స్ట్రువైట్ స్టోన్స్ (Struvite stones) వస్తాయి.
మూత్రాశయంలో స్టోన్స్ రావడానికి కారణాలివే (Causes and Risk Factors)
తగినంత నీరు శరీరానికి అందించకపోవడం వల్ల బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాల అసమతుల్యత కూడా మూత్రాశయంలో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు కూడా బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. మూత్రాశయంలో లేదా మూత్రనాళంలో అడ్డంకులు ఏర్పడితే.. ఇవి రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. జన్యుపరమైన కారణాల వల్ల కూడా బ్లాడర్‌లో స్టోన్స్ వస్తాయి.
బ్లాడర్‌లో రాళ్లు ఉంటే కలిగే ఇబ్బందులివే..
బ్లాడర్‌లో రాళ్లు ఉంటే.. పొత్తి కడుపులో గజ్జ, కటి భాగంలో నొప్పి తీవ్రంగా వస్తుంది. మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బందులు పడతారు. మూత్రాశయం నిండినట్లు అనిపిస్తుంది కానీ.. మూత్రం రాదు. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. మూత్రంలో రక్తం రావడం లేదా ఎరుపు లేదా గోధుమ రంగులో యూరిన్ వస్తుంది. UTIలు సమస్యలు ఎక్కువగా వస్తాయి.
రోగ నిర్ధారణ
మూత్రనాళంలో స్టోన్స్ ఉంటే కొన్ని టెస్ట్‌ల ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు. ఎక్స్-రేలు, CT స్కాన్లు లేదా అల్ట్రాసౌండ్ టెస్ట్‌ల ద్వారా వీటిని గుర్తించవచ్చు. ఖనిజాల అసమతుల్యత, బ్లడ్ టెస్ట్, ఇన్ఫెక్షన్ కోసం యూరిన్ టెస్ట్ చేస్తారు. సిస్టోస్కోపీ ద్వారా కూడా రోగన నిర్ధారణ చేస్తారు.
చికిత్స
ఒకవేళ బ్లాడర్‌లో స్టోన్స్ ఉంటే వాటికి వెంటనే చికిత్స తీసుకోవాలి. సర్జరీ చేసి స్టోన్స్‌ని తొలగిస్తారు. సిస్టోస్కోప్ ద్వారా ఈ ట్రీట్మెంట్ చేస్తారు. లిథోట్రిప్సీ ద్వారా కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హైడ్రేటెడ్‌గా ఉండేందుకు, యూరిన్‌ను డైల్యూట్ చేసేందుకు, స్టోన్స్ ఏర్పడకుండా ఉండేందుకు నీటిని తాగుతూ ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల శరీరానికి కావాల్సిన ఖనిజాలు, కావాల్సిన మోతాదులో అందుతాయి. ఆక్సలేట్, కాల్షియం, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. UTI సమస్యలు, కిడ్నీల సమస్యలు వంటి వాటికి కచ్చితంగా చికిత్స తీసుకోవాలి. జంతువుల ద్వారా వచ్చే ప్రోటీన్‌కి దూరంగా ఉండాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

