Nikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP Desam
సెంగోల్ ప్రధాన అంశంగా హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న సినిమా స్వయంభు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా గురించి నిఖిల్ అప్డేట్ షేర్ చేశారు. కొంపల్లిలో అంతేరా రెస్టారెంట్ బ్రాంచ్ ను ప్రారంభించిన నిఖిల్...అక్కడ ఫుడ్ అండ్ డ్రింక్స్ ను ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత తన ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం స్వయంభు, ఇంకా రామ్ చరణ్ హీరోగా ఇండియా హౌస్ అనే సినిమాలు చేస్తున్నట్లు చెప్పారు నిఖిల్. ఇవి కాకుండా మరో మూడు సినిమాలు ఉన్నాయని వాటి గురించి డీటైల్స్ త్వరలోనే చెబుతానని చెప్పారు నిఖిల్. రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా తనకు ఇష్టమైన ఫుడ్ గురించి మాట్లాడారు నిఖిల్. తనకు రాజుగారి కోడి వేపుడు, మటన్ అంటే చాలా ఇష్టమన్న నిఖిల్ సినిమా ల కోసం డైట్ మెయింటైన్ చేయాల్సి వస్తుందని చెప్పారు. ఫ్రెండ్స్ తో కలిసి సరాదాగా బయటకు వెళ్లినప్పుడు మాత్రం ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోకుండా ఫుల్ గా ఫుడ్ లాగించేస్తానని చెప్పారు.





















