Sarangapani Jathakam Relese Date: 'కోర్ట్' సక్సెస్ జోష్‌లో కొత్త మూవీ రిలీజ్‌కు ప్రియదర్శి రెడీ - ఈ సమ్మర్‌లో నవ్వులు పంచేందుకు 'సారంగపాణి' వచ్చేస్తున్నాడు..
Priya Darshi Movie: యంగ్ హీరో ప్రియదర్శి, రూప కొడువాయూర్ లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సారంగపాణి జాతకం' మూవీ ఈ సమ్మర్‌కు రిలీజ్ కానుంది. ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్లు టీం అధికారికంగా ప్రకటించింది.

Priya Darshi's Sarangapani Jathakam Movie Release Date Announced: టాలీవుడ్ హీరో ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో వచ్చిన 'కోర్ట్' (Court) మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు జోరు కొనసాగిస్తోంది. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.24.4 కోట్లు వసూలు చేయగా ప్రస్తుతం ప్రియదర్శి ఫుల్ జోష్‌లో ఉన్నారు. అదే సక్సెస్ జోష్‌లో తన కొత్త మూవీని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
సమ్మర్‌కు సారంగపాణి
ప్రియదర్శి, రూప కొడువాయూర్ లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సారంగపాణి జాతకం' (Sarangapani Jathakam). ఈ సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం తాజాగా ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ సైతం పంచుకుంది. 'ఈ సమ్మర్ సెలవుల్లో మీ కుటుంబాన్నంతా కచ్చితంగా కడుపుబ్బా నవ్విస్తామని మాది హామీ' అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. ఈ సినిమాను దేవీ మూవీస్ బ్యానర్‌పై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ మూవీని నిర్మించారు.
ఈ సమ్మర్ సెలవుల్లో మీ కుటుంబాన్నంతా కచ్చితంగా కడుపుబ్బా నవ్విస్తామని మాది హామీ 🤩
— Sridevi Movies (@SrideviMovieOff) March 17, 2025
Await a Hilarious Summer Treat with #SarangapaniJathakam from April 18th in theatres ✨
#MohanaKrishnaIndraganti @PriyadarshiPN @RoopaKoduvayur @pgvinda #MarthandKVenkatesh @krishnasivalenk… pic.twitter.com/02zTpR9amx
Also Read: 'ఎవరూ అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు' - బ్రేకప్ ప్రచారం వేళ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా..
గతేడాది డిసెంబరులోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్ , వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫుల్ లెంగ్స్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీ రూపొందినట్లు తెలుస్తోంది.
జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత భారీ అంచనాల మధ్య మోహనకృష్ణ ఇంద్రగంటి, శ్రీదేవి మూవీస్ కలయికలో మూడో చిత్రంగా 'సారంగపాణి జాతకం' రాబోతోంది. జాతకాలను నమ్మే హీరో.. అవే జీవితంలో నిజం అవుతాయని భావిస్తుంటాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోడు. ఈ మూఢ నమ్మకాల వల్ల అతని జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయనేదే ఈ మూవీ కథాంశంగా తెలుస్తోంది.
దూసుకెళ్తున్న ప్రియదర్శి
కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి తన నటనతో మెప్పించారు ప్రియదర్శి. 'బలగం' సినిమాతో కెరీర్‌లో ఒక్కసారిగా దూసుకెళ్లారు. రీసెంట్‌గా వచ్చిన 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడి' మూవీలో యువ లాయర్‌గా తన నటనతో అందరి మనసులు దోచుకున్నారు. ఈ నెల 14న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. నాని నిర్మాతగా వ్యవహరించిన మూవీకి.. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. కోర్ట్ బ్యాక్ డ్రాప్ డ్రామాగా పోక్సో యాక్ట్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

