Tamannaah: 'ఎవరూ అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు' - బ్రేకప్ ప్రచారం వేళ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ హీరో విజయ్ వర్మ బ్రేకప్ వార్తల నేపథ్యంలో తాజాగా తమన్నా చేసిన ఓ సందేశాత్మక పోస్ట్ వైరల్ అవుతోంది. అద్భతాలు మననే సృష్టించాలంటూ ఆమె రాసుకొచ్చారు.

Tamannaah Bhatia Cryptic Note Amid Vijay Varma Breakup Rumours: మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) బ్రేకప్ వార్తలు గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఇప్పటివరకూ అటు తమన్నా కానీ.. ఇటు విజయ్ వర్మ కానీ అధికారికంగా స్పందించలేదు. ఈ క్రమంలో ఆమె తాజాగా పెట్టిన ఓ సందేశాత్మక పోస్ట్ వైరల్ అవుతోంది. ఎప్పుడూ అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసే నటి ఇలా పోస్ట్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
'అద్భుతాలు మననే సృష్టించాలి'
జీవితంలో అద్భుతాలు జరగాలని ఎవరూ ఎదురు చూడొద్దని.. అద్భుతాలు మనమే సృష్టించాలని తమన్నా (Tamannaah) ఆ పోస్ట్‌లో తెలిపారు. తమ రెండేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలికారంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో పాటే ఆమె తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలను సైతం పంచుకున్నారు. రాషా థడానీ, మనీశ్ మల్హోత్రలతో కలిసి దిగిన ఫోటోల్లో తమన్నా నవ్వుతూ కనిపించారు. దీనికి నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. బాధ నుంచి బయటపడేందుకే ఆమె ఇలా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
Also Read: తమిళ స్టార్ హీరోతో పూరీ జగన్నాథ్ మూవీ! - ఊహించని కాంబో.. ఊహించని స్టోరీ.. ఓకే చెప్పేసినట్టేనా..?
హోలీ వేడుకల్లో విడివిడిగా..
తమన్నా, విజయ్ వర్మ ఇటీవల హోలీ వేడుకల్లో విడివిడిగా హాజరయ్యారు. గతంలో ప్రేమలో ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసే ప్రతీ పార్టీ, ఈవెంట్లకు హాజరయ్యేవారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో పాల్గొన్న ఇద్దరూ వేర్వేరుగా వచ్చి.. విడివిడిగానే ఫోటోగ్రాఫర్లను పలకరించుకుంటూ హోలీ విషెష్ చెప్పి వెళ్లిపోయారు. దీంతో వీరి బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బ్రేకప్ రూమర్స్.. అసలు కారణం అదేనా..?
2023లో 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ సమయంలో తమన్నా, విజయ్ వర్మ ప్రేమలో పడ్డారు. ఈ సిరీస్ రిలీజ్ కాక ముందే వీరిద్దరూ కలిసి గోవాలో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య లవ్‌ను తమన్నా కన్ఫర్మ్ చేశారు. అప్పటి నుంచీ వీరు ప్రతీ ఈవెంట్లకు కలిసే వెళ్లేవారు. బాలీవుడ్ 'లవ్ బర్డ్స్'గా పేరొందిన వీరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా సాగింది. అయితే, ఇటీవలే వీరి మధ్య రిలేషన్ షిప్ బ్రేక్ అయ్యిందని పలు ఆంగ్ల మీడియా కథనాలు ప్రచురితమయ్యాయి. పెళ్లి, కెరీర్ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని.. అందుకే బ్రేకప్ నిర్ణయం తీసుకున్నారనే బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది.
తమన్నా పెళ్లి చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించగా.. విజయ్ వర్మ మాత్రం కెరీర్‌పైనే ఫోకస్ చేయాలని.. పెళ్లికి కాస్త టైం కావాలని భావించారట. దీంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారని బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఇద్దరూ ఫ్రెండ్స్‌లా ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, బ్రేకప్ రూమర్స్‌పై ఇప్పటివరకూ ఇద్దరూ బహిరంగంగా స్పందించలేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

