అన్వేషించండి

KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్

Congress MP Mallu Ravi | కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

BRS vs Congress | హైదరాబాద్: బీఆర్‌ఎస్ నాయకుడు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడంపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా ఆయన అభివర్ణించారు. ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు, వారి గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నాయకులు ఇంతలా దిగజారి రాజకీయాలు చేయడం అత్యంత విచారకరమని విమర్శించారు.

ప్రజల చేత ఎన్నికైన ఒక ఎమ్మెల్యేను అవమానిస్తూ, భైతిక దాడికి దిగడం కాంగ్రెస్ పార్టీ దిగజారిన సంస్కృతికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు ఏమాత్రం గౌరవం లేదని ఈ ఘటన మరోసారి నిరూపించిందని  అన్నారు. ఇలాంటి భౌతిక దాడుల ద్వారా ప్రతిపక్షాన్ని అణిచివేయలేరని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఎంపీ మల్లురవి తక్షణమే క్షమాపణ చెప్పాలి..

ఈ దాడిని బీఆర్‌ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండించిన కేటీఆర్, ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి, సంబంధిత నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాకుండా ప్రజా తీర్పుతో ఎదుర్కోవాలని హితవు పలికారు. తమ పార్టీ నేతలపై ఇలాంటి దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే గట్టిగా ఎదుర్కొంటామని కేటీఆర్ హెచ్చరించారు.

అసలేం జరిగింది..

భూమిపూజ కార్యక్రమంలో మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వడ్డేపల్లి మునిసిపాలిటీలోని పైపాడులో మంగళవారం సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం భూమి పూజకు నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యే విజయుడు కొబ్బరికాయ కొట్టిన అనంతరం ఎంపీ మల్లురవి కొబ్బరికాయ కొట్టాల్సిన సమయంలో సంచిని బీఆర్ఎస్ కార్యకర్తలు పక్కకు లాగడంతో వివాదం మొదలై  తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యే, ఎంపీ బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై ఎంపీ మల్లు రవి దాడి!

గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, అలంపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎంపీ మల్లు రవి సహనం కోల్పోయి ఎమ్మెల్యేపై దుర్భాషలాడుతూ, భౌతిక దాడికి దిగారని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. బహిరంగంగానే ఒక ప్రజా ప్రతినిధిపై మరో ప్రజా ప్రతినిధి చేయి చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనపై బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకే కాంగ్రెస్ ఇలాంటి భౌతిక దాడులకు ప్రోత్సహిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీ మల్లు రవి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరోవైపు, కాంగ్రెస్ వర్గాలు ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నాయి. కేవలం వాగ్వాదం మాత్రమే జరిగిందని, దాడి జరగలేదని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కూడా ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సమాచారం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rajya Sabha for Chinthakayala Vijay: రాజ్యసభకు చింతకాయల విజయ్ - చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చేశారా?
రాజ్యసభకు చింతకాయల విజయ్ - చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చేశారా?
Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం - 70 శాతానికిపైగా పోలింగ్ - శుక్రవారమే ఫలితాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం - 70 శాతానికిపైగా పోలింగ్ - శుక్రవారమే ఫలితాలు
Papaya Benefits : బ్రేక్‌ఫాస్ట్‌కి పండిన బొప్పాయి తింటే కలిగే లాభాలివే.. ప్రతిరోజూ తినొచ్చా?
బ్రేక్‌ఫాస్ట్‌కి పండిన బొప్పాయి తింటే కలిగే లాభాలివే.. ప్రతిరోజూ తినొచ్చా?
Mahashivratri 2026: జీవితాన్ని మార్చే రహస్యాలు! మోక్షం పొందడానికి పాటించాల్సిన 3 మార్గాలు!
జీవితాన్ని మార్చే రహస్యాలు! మోక్షం పొందడానికి పాటించాల్సిన 3 మార్గాలు!
Advertisement

వీడియోలు

Sunil Gavaskar vs Nasser Hussain | ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు గవాస్కర్ కౌంటర్ | ABP Desam
Voter Hulchul With Knife | ఓటు వేసేందుకు వచ్చి...కత్తితో దొరికిపోయిన మహిళ | ABP Desam
Sachin Son Arjun Tendulkar Wedding | మోదీని కలిసిన సచిన్ కుటుంబం | ABP Desam
Mohsin Naqvi India vs Pak T20 WC | ఐసీసీ ఒత్తిళ్లకు లొంగబోమన్న మొహ్సిన్ నఖ్వీ| ABP Desam
Abhishek Sharma Health Update | స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajya Sabha for Chinthakayala Vijay: రాజ్యసభకు చింతకాయల విజయ్ - చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చేశారా?
రాజ్యసభకు చింతకాయల విజయ్ - చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చేశారా?
Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం - 70 శాతానికిపైగా పోలింగ్ - శుక్రవారమే ఫలితాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం - 70 శాతానికిపైగా పోలింగ్ - శుక్రవారమే ఫలితాలు
Papaya Benefits : బ్రేక్‌ఫాస్ట్‌కి పండిన బొప్పాయి తింటే కలిగే లాభాలివే.. ప్రతిరోజూ తినొచ్చా?
బ్రేక్‌ఫాస్ట్‌కి పండిన బొప్పాయి తింటే కలిగే లాభాలివే.. ప్రతిరోజూ తినొచ్చా?
Mahashivratri 2026: జీవితాన్ని మార్చే రహస్యాలు! మోక్షం పొందడానికి పాటించాల్సిన 3 మార్గాలు!
జీవితాన్ని మార్చే రహస్యాలు! మోక్షం పొందడానికి పాటించాల్సిన 3 మార్గాలు!
మారుతి స్విఫ్ట్‌ vs టాటా పంచ్‌: 5 ఏళ్ల ఓనర్‌షిప్‌ కాస్ట్‌, మైలేజీ పూర్తి తేడా తెలుసుకోండి? ఏ కారులో మీకు డబ్బు ఆదా?
మారుతి స్విఫ్ట్‌ vs టాటా పంచ్‌: 5 ఏళ్ల ఓనర్‌షిప్‌ కాస్ట్‌, మైలేజీ పూర్తి తేడా తెలుసుకోండి? ఏ కారులో మీకు డబ్బు ఆదా?
Healthy Morning Habits : బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఇవి తినండి.. శరీరాన్ని డీటాక్స్ చేసి హెల్తీగా ఉంచుతాయట
బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఇవి తినండి.. శరీరాన్ని డీటాక్స్ చేసి హెల్తీగా ఉంచుతాయట
Valentine's Day Spl Ring : వాలెంటైన్స్​ డే 2026 స్పెషల్.. గ్రాము బంగారంతో ఉంగరం చేయిస్తే ఎంత ఖర్చవుతుంది? పూర్తి లెక్క ఇదే
వాలెంటైన్స్​ డే 2026 స్పెషల్.. గ్రాము బంగారంతో ఉంగరం చేయిస్తే ఎంత ఖర్చవుతుంది? పూర్తి లెక్క ఇదే
2026 ఫిబ్రవరి 12 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి!
2026 ఫిబ్రవరి 12 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి!
Embed widget