By: Arun Kumar Veera | Updated at : 16 Mar 2025 10:00 AM (IST)
ఆదాయ పన్ను ప్రయోజనం కూడా ( Image Source : Other )
Sukanya Samriddhi Yojana Latest News: ప్రతి ఇంట్లో, తల్లిదండ్రులు తమ సంతానం భవిష్యత్ గురించి వాళ్ల చిన్నతనం నుంచే ఆలోచిస్తారు. ముఖ్యంగా, కుమారుల కంటే కుమార్తెల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. కుమార్తె చదువు & వివాహం, వాటికి సంబంధించిన ఖర్చుల గురించి కాస్తయినా ఆందోళన ఉంటుంది. కీలక సందర్భాల్లో అవసరమైన డబ్బు కోసం తల్లిదండ్రులు వివిధ పథకాలలో పెట్టుబడులు పెడతారు లేదా పొదుపు చేస్తారు.
కూతురి భవిష్యత్తు కోసం ప్లాన్ చేసే ప్రతి తల్లిదండ్రికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకంలో చిన్న మొత్తాలతో పెట్టుబడి పెడితే, ఖాతా పరిణతి (Account Maturity) సమయానికి రూ. 70 లక్షల వరకు డబ్బు కూడబెట్టవచ్చు. ఆ పథకం పేరు ఏంటి, అందులో ఎలా పెట్టుబడి పెట్టాలి?. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
పథకం పేరు 'సుకన్య సమృద్ధి యోజన'
ఆడపిల్లల భవిష్యత్ అవసరాల కోసం భారత ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను నిర్వహిస్తోంది. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగిన స్కీమ్ "సుకన్య సమృద్ధి యోజన". భారత ప్రభుత్వం, 'బేటీ బచావో బేటీ పఢావో' కింద ఈ పథకాన్ని చాలా ఏళ్ల క్రితమే ప్రారంభించింది. ఆడపిల్లల చక్కటి భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ కుమార్తె చదువు, వివాహం కోసం పెద్ద మొత్తంలో డబ్బు పోగవుతుంది.
భారత ప్రభుత్వం, ప్రస్తుతం, సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడులకు 8.20% వడ్డీ (Interest Rate Of Sukanya Samriddhi Yojana) చెల్లిస్తోంది. మరే ఇతర ప్రభుత్వ రంగ పథకం లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనూ ఇంత భారీ వడ్డీ రేటు లేదు.
సుకన్య సమృద్ధి యోజన పథకం కింద, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల కోసం ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 250 & గరిష్టంగా రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఖాతాలో 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. మీ కుమార్తెకు 21 ఏళ్లు నిండిన తర్వాత ఖాతా పరిణతి చెందుతుంది. మీ పాప చదువు కోసం డబ్బు అవసరమైతే, ఆమెకు 18 ఏళ్లు నిండిన తర్వాత కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
దాదాపు రూ.70 లక్షల నిధి
సుకన్య సమృద్ధి యోజనలో ఖాతా తెరిచిన తర్వాత ప్రతి నెలా రూ. 12,500 పెట్టుబడి పెట్టాలి. ఈ మొత్తం సంవత్సరానికి రూ. 1.50 లక్షలు అవుతుంది. ఈ డబ్బును విడతలు వారీగా జమ చేయవచ్చు లేదా ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టవచ్చు. 8.20% వడ్డీ రేటు ప్రకారం, ఖాతా పరిపక్వత సమయానికి మీ ఖాతాలా రూ. 69,27,578 కనిపిస్తాయి. ఇది మీ కుమార్తె ఉన్నత చదువు కోసం, ఆమె వివాహ ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది.
ఆదాయ పన్ను ప్రయోజనం కూడా
సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయ పన్ను మినహాయింపు (Income tax exemption) కూడా లభిస్తుంది.
ఖాతా ఎలా ప్రారంభించాలి?
మీరు సమీపంలోని పోస్టాఫీస్ లేదా మీ బ్యాంక్ శాఖకు వెళ్లి సుకన్య సమృద్ధి యోజన పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Digital Gold:సెబీ హెచ్చరికను పట్టించుకోని ప్రజలు! 11 నెలల్లో 12 టన్నుల డిజిటల్ బంగారం కొనుగోలు!
శాంసంగ్ ఫోల్డ్‌బుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Money Saving Tips : 2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
Gold Rate: బంగారం, వెండి ధరల ట్రెండ్ కొనసాగుతుందా! 2026లో ఎంత పెరుగుతుంది? నిపుణులు ఏమన్నారు?
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు