అన్వేషించండి

BRS MLA Lasya Nanditha Rare Photos : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రేర్‌ ఫొటోస్‌

BRS MLA Lasya Nanditha Rare Photos : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Mla Lasya Nanditha) శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రేర్‌ ఫొటోస్‌

1/36
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Mla Lasya Nanditha) శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

2/36
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

3/36
ఎమ్మెల్యే కారు రెయిలింగ్‌తో పాటు ముందున్న లారీని ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు.

4/36
అతి వేగంతో వచ్చిన కారు ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన ఆనవాళ్లను గుర్తించారు.

5/36
కారు బానెట్ పై భాగం పూర్తిగా ధ్వంసం కాగా.. ఎడమ వైపున ఉన్న ముందు చక్రం ధ్వంసమైంది.

6/36
డ్రైవర్ నిద్రమత్తు, అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మీటర్ బోర్డు 100 కి.మీ స్పీడ్ వద్ద స్ట్రైక్ అయినట్లు గుర్తించారు.

7/36
నందిత కారు బానెట్ పై భాగంలో అంటుకుని ఉన్న ఇసుకను క్లూస్ టీం సేకరించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై రెయిలింగ్ ను మాత్రమే ఢీకొంటే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

8/36
దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. 1987లో హైదరాబాద్ లో ఆమె జన్మించారు. కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు.

9/36
2015లో రాజకీయాల్లోకి వచ్చిన లాస్య.. ఆ ఏడాది కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

10/36
2016లో తండ్రి సాయన్నతో పాటు బీఆర్ఎస్ లో చేరారు. 2016 నుంచి 20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్ గా పని చేశారు. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

11/36
గతేడాది, ఫిబ్రవరి 19న లాస్య నందిత తండ్రి సాయన్న మృతి చెందారు. అనంతరం ఈ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టిగా ప్రయత్నించినా.. మాజీ సీఎం కేసీఆర్ సాయన్న కుమార్తె నందితపైనే నమ్మకం ఉంచారు.

12/36
2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమె బీఆర్ఎస్ తరఫున కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి.. సమీప ప్రత్యర్థిపై 17,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

13/36
ఏడాది వ్యవధిలోనే తండ్రీకుమార్తె మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

14/36
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూడా లాస్య నందిత మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

15/36
అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందారని.. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.

16/36
మాజీ మంత్రి కేటీఆర్ సైతం లాస్య నందిత మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం తెల్లవారుజామున  పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

17/36
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

18/36
'లాస్య నందిత చనిపోయారన్న విషాద వార్తతో నిద్రలేచా. గొప్ప నాయకురాలిగా ఎదుగుతున్న సమయంలోనే యువ ఎమ్మెల్యే చనిపోవడం బాధాకరం.' అంటూ ట్వీట్ చేశారు. ఇటీవలే ఆమె చేసిన ఓల్డ్ ట్వీట్ ను దీనికి కేటీఆర్‌ జత చేశారు.

19/36
లాస్య నందిత ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు వెంటాడాయి. 2 ప్రమాదాల్లో ఆమె బయటపడినా.. మూడోసారి ప్రమాదంలో మృత్యువు కబళించింది.

20/36
ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం 2023, డిసెంబర్ 24న బోయిన్పల్లి వద్ద ఆమె లిఫ్ట్ లో చిక్కుకున్నారు. అక్కడ వీఆర్ ఆస్పత్రి వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

21/36
కార్యక్రమం ముగిసిన అనంతరం లిఫ్ట్ లో కిందకు దిగుతుండగా అందులో చిక్కుకున్నారు. చాలామంది లిఫ్ట్ లోకి వెళ్లడంతో కొద్దిసేపటికి డోర్ తెరుచుకోలేదు. దీంతో లాస్య నందితతో పాటు పలువురు దాదాపు 3 గంటలు అందులోనే చిక్కుకుని ఆందోళనకు గురయ్యారు.

22/36
ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది లిఫ్ట్ డోర్ బద్దలుకొట్టి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

23/36
ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో లాస్య నందిత పాల్గొన్నారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్ వస్తుండగా నార్కట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.

24/36
అదే వేగంతో వెళ్లి ట్రాఫిక్ నియంత్రిస్తున్న హోంగార్డులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే తలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో హోంగార్డుకు గాయాలయ్యాయి.

25/36
ప్రమాద సమయంలో కారులో లాస్య నందితతో పాటు ఆమె సోదరి, ఇద్దరు గన్ మెన్లు ఉన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న లాస్య నందిత తన సోదరితో కలిసి మరో కారులో హైదరాబాద్ చేరుకున్నారు.

26/36
నల్గొండ ప్రమాదం జరిగిన 10 రోజుల తర్వాత శుక్రవారం లాస్య నందితను మరో కారు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది.

27/36
గత ప్రమాదం తర్వాత ఆమె కొత్త కారు కొన్నట్లు సమాచారం. గురువారం సదాశివపేటలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన లాస్య నందిత తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున పటాన్ చెరు ఓఆర్ఆర్ సమీపంలో రెయిలింగ్ ను ఢీకొని ప్రాణాలు కోల్పోయారు.

28/36
ఈ ప్రమాదంలో ఆమె పీఏ, డ్రైవర్ అయిన ఆకాశ్ తీవ్రంగా గాయపడగా.. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిద్రమత్తు, అతి వేగమే కారు ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు

29/36
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి పూర్తి స్దాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

30/36
కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీబస్‌ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న లాస్య నందిత

31/36
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో సమావేశమైన సందర్భంగా దిగిన ఫొటో

32/36
ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్న లాస్య

33/36
‌అసెంబ్లీ సమావేశాల టైంలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత సహచర ఎమ్మెల్యేలతో

34/36
ఈ మధ్య కేటీఆర్‌తో సమావేశమైన సందర్భంగా
ఈ మధ్య కేటీఆర్‌తో సమావేశమైన సందర్భంగా
35/36
ఫిబ్రవరి 19న తండ్రి మొదటి వర్దంతి సందర్భంగా దిగిన ఫొటో

36/36

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన బౌలర్ అశ్విన్ రవిచంద్రన్రేవంత్ రెడ్డీ..  నీ వీపు పగలడం పక్కా..!Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Embed widget