అన్వేషించండి
Revanth Reddy: రైజింగ్ హైదరాబాద్, రైజింగ్ తెలంగాణ చేసేందుకు సహకరించండి - ABP సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit 2024: ఎందరో యువకుల బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా, రైజింగ్ హైదరాబాద్‌గా డెవలప్ చేయడంలో అంతా సహకరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఏబీపీ రైజింగ్ సమ్మిట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
1/5

దక్షిణాది రాష్ట్రాలకు పన్నుల వాటాల్లో హక్కుగా రావలసిన నిధుల విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశం ప్రగతిబాటలో పయనించడానికి ఉత్తరాది, దక్షిణాది అనే వ్యత్యాసం లేకుండా అన్ని రాష్ట్రాలు సమంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.
2/5

ఏబీపీ నెట్ వర్క్ హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన #TheSouthernRisingSummit2024 లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, హైదరాబాద్ అభివృద్ది (#RisingHyderabad)పై, తెలంగాణ అభివృద్ధి (#RisingTelangana) లక్ష్యాలపై తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
3/5

తెలంగాణ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ (Moosi Project), ఫ్యూచర్ సిటీ ఆలోచనలను రేవంత్ రెడ్డి వివరించారు. గుజరాత్ లోని సబర్మతి ప్రాజెక్టుకు మద్దతునిస్తున్న వారు మూసీ ప్రక్షాళనను ఎందుకకు వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.
4/5

మూసీ, ఈసా నదుల కలిసే ప్రాంతమైన బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమంగా మహాత్మా గాంధీ గాంధీ స్మారకాన్ని నిర్మించనున్నామని తెలంగాణ సీఎం తెలిపారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలుకుని కాంగ్రెస్ ప్రధానులు తీసుకొచ్చిన అనేక సంస్కరణలు, వాటి ఫలితాలను ఏబీపీ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు.
5/5

దేశంలోని బహుళార్థ సాధక ప్రాజెక్టులు, విద్య, హరిత విప్లవం (Green Rovolution), బ్యాంకుల జాతీయీకరణ, స్థానిక సంస్థలకు సంబంధించిన 73-74 వ రాజ్యాంగ సవరణలు, శాస్త్ర సాంకేతిక రంగంలో తీసుకొచ్చిన విప్లవం , 18 ఏళ్లకే ఓటు హక్కు, తెచ్చిన ఆర్థిక సంస్కరణలపై రేవంత్ రెడ్డి మాట్లాడారు.
Published at : 25 Oct 2024 05:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion