అన్వేషించండి

Telangana Ration Cards: రెండు రకాలుగా రేషన్ కార్డులు, తెలంగాణలో కొత్త కార్డులు జారీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన

Ration Cards in Telangana | తెలంగాణలో రేషన్ కార్డులు రెండు రకాలుగా జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వీటి రంగులు సైతం భిన్నంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.

Telangana Ration Cards News Update: తెలంగాణలో రేషన్ కార్డులు జారీపై రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక విషయం వెల్లడించారు. తెలంగాణలో ఇకనుంచి రెండు రకాలుగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. దారిద్రవేతకు దిగువన ఉన్నవారికి మాత్రమే బిపిఎల్ కార్డులు ఇవ్వనున్నారు. దారిద్ర రేఖకు పైన ఉన్నవారికి ఐపీఎల్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. బిపిఎల్ కార్డులను మూడు రంగులు కనిపించేలా, ఐపీఎల్ కార్డులను గ్రీన్ కలర్ లో జారీ చేయాలని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో ఒక్కసారి కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని విమర్శలు ఉన్నాయి. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక రేషన్ కార్డుల జారిపై ఫోకస్ చేసిందన్నారు మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి. ఇదివరకే పలుమార్లు కొత్త రేషన్ కార్డులు జారీకి దరఖాస్తులు తీసుకున్నారు. ఏడాది జనవరి 26న కొన్ని గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని రేషన్ కార్డులు జారీ చేయడం తెలిసిందే. నాలుగు రోజులపాటు గ్రామసభలు ఏర్పాటు చేసి మరి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు వస్తాయి అనుకుంటే నిరాశ మిగిలింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త రేషన్ కార్డులు జారీలో జాప్యం జరిగిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని 8 జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ శాంతి కుమారిని ఆదేశించినా ప్రయోజనం లేకపోయింది. 

స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డులు

అసెంబ్లీలో గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ లో రేషన్ కార్డులపై స్పందించారు. తెలంగాణలో ప్రస్తుతం 2.8 కోట్ల మంది రేషన్ కార్డుల లబ్ధిదారులుగా ఉన్నారు. రేషన్ కార్డుల తయారీ సంస్థ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచాం. మార్చు నెలాఖరులలో గా ఆ ప్రక్రియ పూర్తి కానుంది. అర్హులైన అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు జారీచేస్తుంది. ప్రభుత్వం రెండు రకాలుగా రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో జారీ చేయనుంది. ఏప్రిల్ నెలలో రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ట్రై కలర్ కార్డులు జారీ కానున్నాయి. పింక్ కలర్ కార్డులో ఉన్న వారికి గ్రీన్ కలర్ కార్డులు వస్తాయి. పాత కార్డులు ఉన్నవారికి పాటి స్థానంలో స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు. 

టిఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు వెచ్చించడంతో రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లింది. రెండు దఫాలు అధికారంలో ఉన్నా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు (SLBC Tunnel Project)ను కేసీఆర్ పూర్తి చేయలేకపోయారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో రోబోలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇటీవల ప్రమాదం జరగకపోయుంటే SLBC టన్నెల్ పనులు రెండేళ్లలో పూర్తయ్యేవి. నేను ఏడుసార్లు ఎన్నికల్లో గెలిచాను. పలుమార్లు మంత్రిగా చేశాను. నాకు కొత్త ఆశలు లేవని’ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Renuka Chowdhury at ABP Summit: దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
KTR Speech ABP Southern Rising Summit 2026 : రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget