HMDA Latest News : హెచ్ఎండీఏ పరిధిలోకి 11 జిల్లాలు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
HMDA Latest News : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని 11 జిల్లాలకు తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు దీని పరిధిని 10 వేలచదరపు కిలోమీటర్లకు పెరిగింది.

HMDA Latest News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న HMDA పరిధి ఇకపై 10 వేల 472.72 చదరపు కిలోమీటర్లకు చేరనుంది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం HMDA పరిధిలోకి మరో 36 రెవెన్యూ విలేజ్లు చేరాయి. 11 జిల్లాలకు చెందిన 104 మండలాలు, 1355 గ్రామాలు ఇకపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీగా పిలుస్తారు. ప్రారంభ సమయంలో దీని విస్తీర్ణం కేవలం 650 చదరపు కిలోమీటర్లే ఇప్పుడు అది పదివేల కిలోమీటర్లకు చేరింది.
1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడాను ఏర్పాటు చేశారు. అప్పటి దీని విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లు. దీన్ని 2008 వరకు ఎవరూ మార్చలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హుడాను కాస్త HMDAగా మార్చేశారు. పరిధిని కూడా 7,257 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు.
ఇప్పుడు మరోసారి విస్తరించారు. దీంతో HMDA పరిధి10 వేల 472.72 చదరపు కిలోమీటర్లకు చేరింది. సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకొని అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది





















