అన్వేషించండి
Telangana News: గోదావరి, కృష్ణా పుష్కరాలపై తెలంగాణ సీఎం ఫోకస్- అధికారులకు కీలక ఆదేశాలు
Telangana News: తెలంగాణ ముఖ్యమంత్రి పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహించి గోదావరి, కృష్ణా పుష్కరాల ప్రస్తావన తీసుకొచ్చారు. కీలక ఆదేశాలు జారీ చేశారు.

గోదావరి, కృష్ణా పుష్కరాలపై తెలంగాణ సీఎం ఫోకస్- అధికారులకు కీలక ఆదేశాలు
1/12

పర్యాటక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
2/12

ఫిబ్రవరి 10లోపు టూరిజం పాలసీని సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
3/12

దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలన్న సీఎం దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలన్నారు.
4/12

ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు సీఎం,
5/12

సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు.
6/12

జాతరతోపాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్ అభివృద్ధి చేయాలని చెప్పారు.
7/12

ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాంతాల్లో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలుండాలన్నారు.
8/12

సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని అధికారులకుసూచించారు ముఖ్యమంత్రి
9/12

వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
10/12

హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
11/12

పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
12/12

హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమీక్, జరిగింది.
Published at : 29 Jan 2025 10:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion