Parvatmala project Explained in Telugu | రోడ్లు వేయలేని మార్గాల్లో రోప్ వే తో మహారాజులా ప్రయాణం |ABP
హిమాలయాల్లోని ఆలయాలను ఇక గాలిలో తేలుతూ చేరుకోవచ్చు.. దుర్గమమైన మార్గాల్లో గంటల కొద్దీ సాగే ప్రయాణాలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. నిమిషాల్లోనే కొండ ప్రాంతాలకు చేరుకునేందుకు ఇప్పుడు తీగల దారలు వస్తున్నాయి. నేలమీద భారీ రహదారులను నిర్మిస్తున్న National Highway Authority of India-NHAI ఇప్పుడు ఆకాశాన్ని తాకినట్లుండే కొండలపైన తీగల మార్గాలను నిర్మించనుంది. రెండేళ్ల క్రితం ప్రకటించిన పర్వతమాల పరియోజనలో ఫథకంలో భాగంగా ఉత్తరాఖండ్‌లో చేపట్టబోయే రెండు ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) "నేషనల్ రోప్‌వేస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కు అనుమతులు ఇచ్చింది. గోవిందఘాట్ – హేమ్‌కుండ్ సాహిబ్ జీ రోప్‌వే (12.4 కిమీ) – ₹2,730.13 కోట్లు
సోన్ప్రయాగ – కేదార్‌నాథ్ రోప్‌వే (12.9 కిమీ) – ₹4,081.28 కోట్లులకు అనుమతులు వచ్చాయి. ఈ రెండు ప్రాజెక్టులు Design, Build, Finance, Operate, and Transfer (DBFOT) మోడల్ లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) ప్రాతిపదికన అభివృద్ధి చేస్తారు.
ఏంటీ పర్వతమాల పరియోజన..?
మన దేశంలో దాదాపు ౩౦ శాతం భూభూగంలో కొండలు, పర్వతాలున్నాయి. జమ్మూకాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్‌తోపాటు.. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం పర్వతాలు, లోయలతోనే నిండి ఉన్నాయి. ఇక్కడ రోడ్లు వేయడం కూడా కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి చోట్లలో కూడా చివరి మైల్ వరకూ కనెక్టివిటీ ఇవ్వాలన్న తలంపుతోనే ఈ ప్రాజెక్టును 2022 బడ్జెట్‌లో ప్రకటించారు. హిమాలయాల్లో చాలా వరకూ పవిత్రమైన ధామాలున్నాయి. హిందువులు ఎక్కువుగా దర్శించుకునే ఆలయాలతో బౌద్ధుల Monestryలు ఇక్కడ ఉండటంతో పెద్ద ఎత్తున పర్యాటకులు వెళుతుంటారు. రైలు, వైమానిక మార్గాలు పరిమితంగా ఉండటంతో పాటు, రహదారి నిర్మాణానికి సాంకేతిక సమస్యలు ఉన్నాయి అయితే రోడ్లు చాలా చిన్నగా ఉండటంతో మోటార్ ట్రాన్స్‌పోర్ట్ లేక పెద్ద వయసు వారు ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో రోప్‌వేలు వేయడం సురక్షితమైన మార్గంగా గుర్తించారు. అలా తెరపైకి వచ్చిందే పర్వతమాల ప్రాజెక్టు. National Highway Logistics Management Limited (NHLML)కు ఈ ప్రాజెక్టు కార్యాచరణ అప్పగించారు. 5 సంవత్సరాలలో 1,200 కిమీ విస్తీర్ణంలో 250 రోప్‌వే ప్రాజెక్టుల అభివృద్ధి చేయాలన్నది దీని లక్ష్యం.




















