Janasena Plenary: జనసేన ఆవిర్భావ సభకు వెళ్లే వారికి అలర్ట్ - మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, పోలీసుల భారీ బందోబస్తు
Janasena Formation Day : జనసేన 12 ఆవిర్భావ సభకు వచ్చే వారి కోసం నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న భోజనం, మజ్జిగ, తాగునీరు కేంద్రాలున్నాయి. 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Janasena Foundation Day | పిఠాపురం: జనసేన స్థాపించి 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏడాదిలోకి అడుగుపెడుతోంది. గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన జనసేన, 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో నెగ్గింది. అధికార కూటమిలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) అధ్యక్షుడిగా ఉన్న జనసేన పార్టీ నేడు ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తోంది. నేడు (మార్చి 14న) పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో 50 ఎకరాల ప్రాంగణంలో 'జయ కేతనం' పేరుతో సభ నిర్వహిస్తున్నారు. తెలుగు సంస్కృతి చరిత్ర అద్దం పట్టేలా సభ (Janasena Plenary) నిర్వహణను జనసేన ప్లాన్ చేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, తాజా పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం కనిపిస్తోంది.
భోజన సదుపాయం, మజ్జిగ, చలివేంద్రాలు ఏర్పాటు
జనసేన 12వ ఆవిర్భావ సభకు విచ్చేస్తున్న ప్రజలందరికి పార్టీ నేతలు ఊరట కలిగించే విషయం చెప్పారు. సభకు వచ్చే వారికి జనసేన పార్టీ నేతలు మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పించారు. అసలే వేసవికాలం కావడంతో మజ్జిగతో పాటు చలివేంద్రాలు, తాగు నీరు సదుపాయం ఏర్పాటు చేశారు. జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు అంతా దగ్గర ఉండి మీటింగ్ కి వచ్చేవారికి భోజన సదుపాయాలు, వడ్డన చూసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించింది. కోరుకుంటున్నాము.
The Day has arrived. Let the Celebrations begin !#JanaSena12thFormationDay #JanaSenaJayaKethanam pic.twitter.com/S5EGuQoT09
— JanaSena Party (@JanaSenaParty) March 13, 2025
భోజనం సదుపాయం ఏర్పాటు చేసిన ప్రదేశాలు:
1 . చేబ్రోలు నుండి గొల్లప్రోలు వెళ్లే NH 216 హైవే లో చేందుర్తి జంక్షన్ లో శ్రీదుర్గమ్మ ఆలయం వద్ద
https://maps.app.goo.gl/jKZSrQ972JLvD5pm9
2 . గొల్లప్రోలు HP పెట్రోల్ బంక్ జంక్షన్ పక్కన ఉన్న స్థలంలో
https://maps.app.goo.gl/CPWGShEQkR3kVQXS7
3 . టోల్ ప్లాజా నుండి పిఠాపురం వై జంక్షన్ మధ్యలో ఉన్న రైస్ మిల్లులో
https://maps.app.goo.gl/QQgyihgBS8kLanya9
4 . గోపాలబాబా ఆశ్రమం ఎదురుగా ఉన్న స్థలంలో భోజనాలు
https://maps.app.goo.gl/curd9FNsP35VQi7A9
1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు
న భూతో న భవిష్యత్ అనేలా జయకేతనం ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ మద్దతుదారుల, అభిమానులు జనసేన ప్లీనరీకి తరలి రానుండటంతో 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలు వైపుల నుంచి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందరికీ ఆహారం, మంచినీరు అందరికీ అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, సౌకర్యాలు కల్పించారు.
సభా స్థలంలో 12 అంబులెన్సులు, మెడికల్ బృందాలు సిద్ధం చేసి అన్ని విధాలుగా జయకేతనం సభకు జనసేన సిద్ధంగా ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జనసేన సభ మొదలుకానుంది. పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం నాడు ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించారు. తుది దశకు వచ్చిన పనులపై వివిధ కమిటీల నాయకులు, రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సభకు హాజరయ్యే వారికి ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు.






















