Chitrada Public Talk | చిత్రాడలో జనసేన విజయకేతనం సభపై స్థానికుల అభిప్రాయం | ABP Desam
పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలోని ఏబీ వెంచర్స్ ప్రాంగణంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 14న నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ఆపార్టీ అధినాయకత్వం... పవన్ కల్యాణ్ ఈకార్యక్రమ బహిరంగ సభలో పాల్గని ప్రసంగించనున్నారు. దీంతో అందరి దృష్టి ఈ ప్రాంతంపై పడిరది.. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తరలివచ్చే అవకాశాలున్నాయి.. ఈనేపథ్యంలోనే చిత్రాడ ప్రజలు పవన్ కల్యాణ్ సభ గురించి ఏం చెబుతున్నారు..? పవన్ కల్యాణ్ పనితీరుపై ఏం చెబుతున్నారు..? చిత్రాడ గ్రామ ప్రజల నుంచి వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబీపీ దేశం. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి ఈ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్..తన నియోజకవర్గానికి ఏం చేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చిత్రాడలో విజయకేతనం పేరుతో పార్టీ ఆవిర్భావదినోత్సవాన్ని, ప్లీనరీని నిర్వహిస్తున్న జనసేన అధినేత..అందుకోసం ముందు తమ ఊరికి ఏం చేశారో చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.





















