Rashmika: కుంటుకుంటూ... వీల్ ఛైర్‌లో ముంబైకు రష్మిక - అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లిందో తెలుసా?
Rashmika Mandanna in Wheelchair: నేషనల్ క్రష్ రష్మిక ఎయిర్ పోర్టులో కుంటుకుంటూ నడిచిన, వీల్ ఛైర్‌లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంత అర్జెంటుగా ఆవిడ ఎందుకు వెళ్ళిందో తెలుసా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు (Rashmika Mandanna) కొన్ని రోజుల క్రితం గాయం అయింది. కాలికి గాయం కావడంతో పట్టి కట్టిన ఫోటోలను ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అభిమాన నటి త్వరగా కోలుకోవాలని ఫాన్స్ అందరూ మెసేజ్ చేశారు. అప్పటి నుంచి ఆవిడ హైదరాబాదులో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే, ఈ రోజు ముంబై వెళ్లారు.
ఎయిర్ పోర్టులో కుట్టుకుంటూ...
ఫ్లైట్ దిగిన తర్వాత వీల్ ఛైర్‌లో!
రష్మిక మందన్న బుధవారం ఉదయం హైదరాబాదు నుంచి ముంబై వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కారు దిగిన తర్వాత ఆమె కుంటుకుంటూ వెళ్ళిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ముంబైలో ఫ్లైట్ దిగిన తర్వాత వీల్ ఛైర్ సాయంతో ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. ఆ వీడియోలు సైతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఎందుకు అంత అర్జెంటుగా వెళ్లడం?
ఎయిర్ పోర్ట్ వీడియోలు చూస్తే రష్మిక మందన్న కాలికి బలమైన గాయం అయినట్టు అర్థం అవుతుంది. ఆ గాయంతో షూటింగ్ చేయడం కుదరదు. మరి ఎందుకు అంత అర్జెంటుగా హైదరాబాదు నుంచి ముంబైకి వెళ్లడం అంటే... ట్రైలర్ లాంచ్ కోసం!
విక్కీ కౌశల్ హీరోగా నటించిన హిస్టారికల్ వార్ యాక్షన్ డ్రామా 'ఛావా' (Chhaava Movie). అందులో ఆయనకు జోడీగా రష్మిక నటించారు. మహారాణి యేసు బాయి పాత్రలో సందడి చేయనున్నారు. ఆ సినిమా ట్రైలర్ (Chhaava Trailer) ఈ రోజు ముంబైలో విడుదల అవుతోంది. ఆ కార్యక్రమానికి హాజరు కావడం కోసం రష్మిక ముంబై వెళ్లారు. అదీ అసలు విషయం.
శంభాజీ కథ ఏమిటి? అసలు ఏమిటి ఈ 'ఛావా'?
ఫిబ్రవరి 14న 'ఛావా' సినిమా థియేటర్లలోకి రానుంది. మొఘల్ సామ్రాజ్యం మీద మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ చేసిన యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. 'ఛావా'లో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించారు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని బాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
Also Read: క్షమాపణలు చెప్పిన వేణు స్వామి... నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గాడండోయ్





















