అన్వేషించండి

Hyderabad Data Center: హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్ ఎస్ ఒప్పందం

CtrlS to build data center campus near Hyderabad in Telangana | దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ ఒప్పందం కుదుర్చుకుంది.

Data Center in Hyderabad | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. ఇదివరకే యూనిలీవర్, హెచ్‌సీఎల్ లాంటి దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. తాజాగా హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ (CtrlS) ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economin Forum)లో భాగంగా రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కంట్రోల్ ఎస్ సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు. 

హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్
తెలంగాణలో అత్యాధునిక AI డేటాసెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు తెలంగాణ బృందంతో భేటీ అనంతరం సంతకం చేసింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ (Artificial Data Center) క్లస్టర్ ఏర్పాటుకు ఈ కంపెనీ రూ. 10,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఓవరాల్ గా 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలంగాణ ప్రతినిధులు అంచనా వేశారు. 

ఈ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్దిలో కంట్రోల్ ఎస్ వారు నెలకొల్పనున్న ఈ డేటా సెంటర్ మరో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఐటీ సేవల సామర్థ్యం తెలంగాణలో పెరుగుఉందని, నగరంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని అన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో తెలంగాణ ఐటీ సేవలలో మరింత వృద్ది సాధిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సాంకేతిక అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం చేసుకోవడంపై గర్వంగా ఉందన్నారు.

 

తెలంగాణకు వచ్చిన పెట్టబడులు ఇవే..

యూనిలీవర్‌ తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వినియోగ వస్తువుల తయారీలో యూనిలీవర్‌కు మంచి పేరుంది. కామారెడ్డిలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుతో పాటుు బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు యూనిలీవర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆపై టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ సైతం హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చింది. 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ సెంటర్ ఏర్పాటుతో 5000 మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Also Read: HCL Tech Center In Hyderabad: హైదరాబాద్‌లో హెచ్​సీఎల్ కొత్త టెక్ సెంటర్, దావోస్‌లో రేవంత్ రెడ్డితో ఒప్పందం - 5000 ఉద్యోగాలు కన్ఫామ్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget