అన్వేషించండి

WhatsApp New Update : వాట్సాప్​లో త్వరలో న్యూ అప్​డేట్.. ఇకపై స్టేటస్​ను నేరుగా ఫేస్​బుక్, ఇన్​స్టాలో షేర్ చేసుకోవచ్చట

WhatsApp Status : వాట్సాప్​ నుంచి త్వరలోనే ఓ క్రేజీ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. మీరు వాట్సాప్​లో స్టేటస్​లు పెట్టే అలవాటు ఉన్నవారైతే.. కచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. 

WhatsApp Status Sharing : సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించేవారికి ఓ గుడ్ న్యూస్. ఇకపై మీరు వాట్సాప్​లో షేర్ చేసే స్టేటస్​ను నేరుగా ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేయొచ్చు. అయితే ఈ అప్​డేట్ రావడానికి మరికొద్ది టైమ్ పడుతుందట. ఈ అప్​డేట్​ను త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా పరియడం చేయనున్నట్లు వాట్సాప్ చెప్తోంది. అసలు ఈ కొత్త అప్​డేట్ ఏంటి? ఇది ఎలా ఉపయోగపడుతుంది? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​ వంటి మెటా ప్లాట్​ఫారమ్​ యాప్స్​లలో వాట్సాప్ స్టేటస్​లను ఆటోమేటిక్​గా షేర్ చేసుకునే సౌలభ్యం తీసుకురానున్నట్లు వాట్సాప్ తెలిపింది. వాట్సాప్​లో షేర్ చేసిన స్టేటస్​ను ఆటోమేటిక్​గా షేర్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్నట్లు.. త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. 

ఒకేసారి లాగిన్ అవ్వొచ్చు..

ఒకటే సైన్ ఆన్​తో వివిధ మెటా యాప్​లకు లాగిన్ చేయడాన్ని సులభతరం చేయడంతో పాటు.. వేగంగా సమాచారాన్ని పోస్ట్ చేసేందుకు ఇది ఉపయోగపడనున్నట్లు తెలిపారు. అలాగే వాట్సాప్.. సోషల్ మీడియా యాప్​లలో మరిన్ని యూనివర్సల్ ఫీచర్​లను పరిచయం చేయనున్నట్లు, రోల్​అవుట్ తర్వాత మరిన్ని మార్పులను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపింది. 

షేరింగ్ వద్దనుకుంటే..

రానున్న నెలల్లో మెటా ప్లాట్​ఫారమ్​లు ఐడీల నుంచి వాట్సాప్​ను జోడించే వీలును తీసుకురానుంది. అయితే ఇది కావాలనుకునేవారు చేసుకోవచ్చు. లేదంటే ఇగ్నోర్ చేయవచ్చు. ఇది పూర్తిగా వ్యక్తిగతమని తెలిపింది. యూజర్స్ ఇప్పటికీ తమ వాట్సాప్​ నుంచి ఇతర యాప్స్​కు షేర్ చేయవద్దనుకుంటే ఆ ఆప్షన్​ను సెలక్ట్ చేయకుంటే సరిపోతుందని తెలిపింది. నేరుగా వాట్సాప్​ నుంచి Facebook, Instagram స్టోరీలను అప్​డేట్ చేయాలనుకుంటే ఈ ఫీచర్​కు యాక్సెస్ ఇస్తే సరిపోతుందట. దీనివల్ల ఒకటే సమాచారాన్ని ఎక్కువ సార్లు పోస్ట్ చేయాల్సిన అవసరముండదు. ఈజీగా పనైపోతుంది. ఇన్​ఫ్లూయెన్సర్లకు, యూట్యూబర్లకు ఇది బెస్ట్​ ఆప్షన్​గా ఉండనుంది. 

వాట్సాప్ ఇంటిగ్రేషన్

త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ అప్​డేట్​ను తీసుకురానున్నారు. అయితే రోల్ అవుట్ పద్ధతిలో దశలవారీగా ఇది వచ్చే అవకాశముంది. ఆప్షన్ అందుబాటులోకి వస్తే యూజర్స్ WhatsApp సెట్టింగ్​లలో దీనిని చూస్తారు. అనంతరం అకౌంట్స్ సెంటర్ ఇంటిగ్రేషన్ మూడు యాప్​ల కోసం ఒకే సైన్​ఆన్​ని తీసుకువస్తుంది. దీనివల్ల వల్ల యూజర్స్ తక్కువ సమయంలో రీ లాగిన్ అయ్యే వెసులుబాటు ఇస్తుంది. దీనివల్ల యాప్​లలో ఒకేసారి అవతార్​లు, AI స్టిక్కర్‌లు, ఇమాజిన్ మి క్రియేషన్‌లను నిర్వహించగల సామర్థ్యంతో కూడినన కొత్త ఫీచర్‌లను కూడా విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. 

ప్రైవసీ ఉంటుందా?

మెటా ప్లాట్​ఫారమ్​లను ఇలా వాట్సాప్​తో కనెక్ట్ చేస్తే.. ప్రైవసీ పరిస్థితి ఏంటి అనే డౌట్ అందరికీ వస్తుంది. ఈ విషయంపై కూడా వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది. WhatsApp అకౌంట్, Meta ప్లాట్‌ఫారమ్‌ల అకౌంట్​లను కనెక్ట్ చేసినా.. వ్యక్తిగత మెసేజ్​లు, కాల్​లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా సేఫ్​గా ఉంటాయని తెలిపింది. వేరే యాప్స్ కూడా ఈ డేటాను చదవలేవని తెలిపింది. 

Also Read : ఇన్​స్టాగ్రామ్​లో న్యూ ఫీచర్స్.. ఇకపై మూడు నిమిషాల నిడివి ఉన్న రీల్స్ పోస్ట్ చేయవచ్చట, మరో అప్​డేట్ కూడా

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
Sahaa Movie : గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Embed widget