బీచ్ ట్రిప్‌కి వెళ్లినప్పుడు ఫోటోలు దిగేందుకు ఫోన్స్ ఉపయోగిస్తారు. లేదా నీటిలో ఆడుకుంటారు. ఆ సమయంలో అనుకోకుండా ఫోన్ నీటిలో పడిపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఫోన్ నీటిలో పడితే వీలైనంత త్వరగా దానిని బయటకి తీసేయండి. ఎంత త్వరగా తీస్తే అంత తక్కువ నష్టం ఉంటుంది. ఫోన్‌ని వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది. ఫోన్ కేసులు, సిమ్ కార్డ్‌లు, ఎస్డీ కార్డులు ఉంటే తీసేయండి. దానిని డ్రై చేయడానికి ట్రై చేయండి. అదనపు నీటిని తొలగించడానికి మెత్తని క్లాత్ లేదా టవల్‌తో మెల్లగా తుడవండి. కుదిరితే ఫోన్ భాగాలను బియ్యంలో ఉంచండి. లేదా సిలికా జెల్ ప్యాకెట్లు లేదా తేమను పీల్చే డెసికాంట్ బ్యాగ్‌లో ఉంచాలి. ఫోన్‌ని డ్రై చేయడానికి హెయిర్ డ్రయర్, ఓవెన్ లేదా మైక్రోవేవ్ వంటి వాటిని ఉపయోగించకూడదు. ఫోన్‌ని కనీసం 24 నుంచి 48 గంటలు పూర్తిగా డ్రై కానిచ్చి.. అప్పుడు దానిని ఆన్ చేయండి. దగ్గర్లోని మొబైల్ రిపేర్ షాప్‌కి వెళ్లి.. రీచెక్ చేయించండి. (Images Source : Freepik)