అన్వేషించండి
Charlapally Terminal: అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ - ద.మ రైల్వే ఆధునీకరణలో ఓ అరుదైన మైలురాయి
Charlapally Terminal: హైదరాబాద్‌లో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.430 కోట్లతో దీన్ని అభివృద్ధి చేశారు.

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోదీ
1/9

హైదరాబాద్ చర్లపల్లి టెర్మినల్‌ను ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.430 కోట్లతో అభివృద్ధి చేపట్టగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది.
2/9

అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మితమైన ఈ శాటిలైట్ టెర్మినల్ ద.మ రైల్వే పరిధిలో ఓ అరుదైన మైలురాయి. ఈ టెర్మినల్ రోజుకు సుమారు 50,000 మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
3/9

చర్లపల్లి టెర్మినల్‌కు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఫీడర్ బస్సులు అందుబాటులో ఉండగా, TSRTC బస్సులు, టాక్సీలు, ఆటోలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు సులభంగా ప్రవేశించేందుకు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు.
4/9

ప్రయాణికుల వాహనాల కోసం విస్తరించిన పార్కింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. రైళ్ల రాకపోకలపై సమాచారాన్ని అందించేందుకు డిజిటల్ డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు.
5/9

రూ.430 కోట్లతో అత్యాధునిక హంగులతో దీన్ని అభివృద్ధి చేశారు. ఈ నెల 7 నుంచి గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ ఇంటర్‌సిటీ రైళ్లకు అదనపు స్టాపేజ్లు చర్లపల్లి టెర్మినల్‌లో కల్పించబడ్డాయి.
6/9

ఈ టెర్మినల్‌లో ప్రయాణికులకు సకల సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ప్రతి ప్లాట్‌ఫారమ్‌కు సులభంగా చేరుకునేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులు అందుబాటులో ఉన్నాయి.
7/9

ప్రయాణీకులు సౌకర్యవంతంగా ప్రత్యేక ఏసీ లాంజ్‌లు ఏర్పాటు చేశారు. టికెట్లు వేగంగా, సులభంగా పొందేందుకు ఆధునిక డిజిటల్ టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.
8/9

సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా పాల్గొనగా.. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
9/9

రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నామన్నారు.
Published at : 06 Jan 2025 03:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
అమరావతి
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion