Chandrababu with Bloomberg: త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?
Babu With Bloomberg: మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు చేరుతారా అన్న సందేహంపై ఏపీ సీఎం క్లారిటీ ఇచ్చారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు.

Will Chandrababu join Modi cabinet : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రధానితో మోదీతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్‌లోకి చంద్రబాబు వెళ్లబోతున్నారా అని అంతర్జాతీయ మీడియాకు సందేహం వచ్చింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు అక్కడ బ్లూమ్ బెర్గ్ ప్రతినిధికి ఇంటర్యూ ఇచ్చారు. ఈ ఇంటర్యూలో బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధి..మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఎప్పుడైనా ఆయన మంత్రివర్గంలో చేరే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే బాధ్యత - రాజకీయ లక్ష్యాలు లేవన్న చంద్రబాబు
ఈ ప్రశ్నకు చంద్రబాబు కాస్తంత ఆశ్చర్యపోయారు. అయితే తనకు ఎలాంటి లక్ష్యాలు ఇక లేవని రాష్ట్రాన్ని గాడిన పెట్టడం మాత్రమే తన లక్ష్యమని స్పష్టం రాజకీయంగా ఎలాంటి ఆశయాలను తాను సాధించాలని అనుకోవడం లేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు. గత ఐదేళ్ల కాలంలో మరింత ఘోరమైన విద్వంసం జరిగిదన్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిన పెట్టడం తప్ప మరో అంశాన్ని ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. ప్రజలు తమ మీద ఎంతో నమ్మకంతో అధికారం అప్పగించారని అన్నారు. భారత ప్రభుత్వం, కూటమిలోని మూడు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
మోదీ కేబినెట్‌లోకి ఆహ్వానిస్తే ఏం చేస్తారు ?
ముఖ్యమంత్రి ఇలా చెబుతున్న సమయంలో బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి మరో ప్రశ్న అడిగారు. కేంద్ర కేబినెట్‌లోకి రావాలని ప్రధానమంత్రి మోదీ ఆహ్వానిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని చంద్రబాబు బదులిచ్చారు. చాల మంది మంత్రులు ఉన్నారని.. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కేంద్ర మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. నా వరకు వీలైనంత వరకూ తన బెస్ట్ కంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారు. సమావేశాలు జరిగినప్పుడు తన ఆలోచనలు పంచుకుంటూనే ఉన్నామన్నారు. తాము ఓ టీంలాగా పని చేస్తున్నామన్నారు. వికసిత్ భారత్ చేయాలని..అబివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేది ప్రధానమంత్రి మోదీ ఆశయం అన్నారు.
చంద్రబాబు మోదీ కేబినెట్‌లోకి వెళ్తారని అంతర్జాతీయ మీడియా విశ్లేషణ
ముఖ్యమంత్రి పదవి కంటే కేంద్ర కేబినెట్ పదవి పెద్దది అని అంతర్జాతీయ మీడియా భావిస్తూ ఉటుంది. ప్రోటోకాల్ ప్రకారం సీఎంతో సమానంగా కేంద్ర కేబినెట్ మంత్రికి ప్రాధాన్యం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి అంటే పూర్తిగా ఓ రాష్ట్రం మొత్తానికి హెడ్. ఆయనకు రాష్ట్ర పరిధిలో సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్ పదవి కన్నా ముఖ్యమంత్రిగా ఉండటానికే ఎవరైనా ఇష్టపడతారు. కానీ అంతర్జాతీయ మీడియా కేంద్ర కేబినెట్ పదవిని సీఎం పోస్టు కన్నా బెటర్ అనుకోవడం వల్ల ఇలాంటి ప్రశ్నలు వేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read: ఇక లోకేష్ సీఎం నినాదం - చంద్రబాబు ఢిల్లీ వెళ్తారా ?





















