అన్వేషించండి
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ - ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం
Tollywood Celebrities Meeting With CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
1/8

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు.
2/8

సీఎంతో భేటీ అయిన వారిలో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేశ్, సి.కల్యాణ్, నాగవంశీ, గోపీ అచంట, బీవీఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి ఉన్నారు.
3/8

అలాగే, త్రివిక్రమ్ శ్రీనివాస్, నవీన్, రవిశంకర్, మురళీమోహన్, హరీశ్ శంకర్, కొరటాల శివ, వశిష్ట, సాయిరాజేశ్, బోయపాటి శ్రీను, కిరణ్ అబ్బవరం కూడా సీఎంతో భేటీ అయ్యారు.
4/8

నటుడు వెంకటేశ్ సీఎంకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం సినీ పరిశ్రమ సమస్యలపై టాలీవుడ్ పెద్దలు చర్చించారు.
5/8

అటు, ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్, చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలు ఈ భేటీలో పాల్గొన్నారు.
6/8

సమావేశం ప్రారంభం సమయంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సీఎం రేవంత్ సినీ ప్రముఖుల ఎదుట ప్రదర్శించారు.
7/8

అనంతరం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతర పరిణామాలపై సీఎంతో టాలీవుడ్ పెద్దలు చర్చించారు. ఈ క్రమంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ కమిటీ పలు అంశాలపై అధ్యయనం చేయనుంది.
8/8

రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అదనపు షోల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు, టికెట్ రేట్ల పెంపుపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. దీనికి అనుగుణంగా సర్కారు కార్యాచరణ చేపట్టనుంది.
Published at : 26 Dec 2024 02:00 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















