అన్వేషించండి
Coconut Water : వేసవిలో కాలంలో కొబ్బరి నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
Health Benefits with Coconut Water : సమ్మర్లో చాలామంది కొబ్బరి నీళ్లు తీసుకుంటారు. అయితే దీనితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ సమ్మర్ హీట్‌ని బీట్ చేసేద్దాం.

కొబ్బరి నీళ్లతో కలిగే ప్రయోజనాలు ఇవే (Image Source : Unsplash)
1/9

కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తాయి. కండరాల పనితీరుకు మద్ధతునిచ్చి.. పూర్తి ఆరోగ్య శ్రేయస్సును మెరుగుపరుస్తాయి.
2/9

కొబ్బరి నీళ్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి.. ఫ్రీ రాడికల్స్ సమస్యను ఎదుర్కోవడంలో హెల్ప్ చేస్తాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా హెల్ప్ చేస్తాయి.
3/9

సమ్మర్లో వచ్చే జీర్ణ సమస్యలను సహజంగా తగ్గిస్తాయి. ఇవి శరీరానికి హైడ్రేషన్‌ని అందించి.. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. గట్ హెల్త్‌ని మెరుగుపరుస్తుంది.
4/9

గుండె ఆరోగ్యానికి కొబ్బరినీళ్లు చాలా మేలు చేస్తాయి. రక్తపోటును కంట్రోల్ చేసి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్‌ని కూడా కంట్రోల్ చేస్తాయి.
5/9

కిడ్నీలో రాళ్లను నివారించడంలో కొబ్బరినీళ్లు మంచి ఫలితాలు ఇస్తాయి. సహజంగా వాటిని విచ్ఛిన్నంచేసి.. టాక్సిన్లను బయటకు పంపి.. మూత్రపిండాల సమస్యలను కంట్రోల్ చేస్తాయి.
6/9

కొబ్బరి నీళ్లలోని యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. గ్లూకోజ్ నియంత్రణకు మద్ధతునిస్తాయి.
7/9

వేడివల్ల కలిగే మంటను తగ్గించే లక్షణాలు కొబ్బరి నీళ్లలో ఉంటాయి. ఇది కణజాలాలకు ఉపశమనం ఇస్తుంది.
8/9

కొబ్బరి నీరు చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి. మెటిమలను కంట్రోల్ చేస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి పోషణ అందించి.. స్కిన్ హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.
9/9

గర్భణీ స్త్రీలు హైడ్రేషన్ కోసం కొబ్బరి నీళ్లు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. బేబీ గ్రోత్‌కి కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. జీర్ణక్రియకు మద్ధతు ఇస్తుంది.
Published at : 16 Mar 2025 01:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion