South Actress: యాభై సెకన్లకు 5 కోట్ల రెమ్యూనరేషన్, 200 కోట్ల ఆస్తులు... ఎఫైర్లు, గొడవలు తక్కువేమీ కాదు... ఈ సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరో తెల్సా?
Actress : 50 సెకన్లకే 5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా చరిత్రను సృష్టించింది. 200 కోట్ల ఆస్తులు, ఎఫైర్లు, గొడవలతో వార్తల్లో నిలిచిన ఈ సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా ?

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు స్టార్ హీరోయిన్ కావాలనే కలతో అడుగు పెడతారు. అయితే ఆ అదృష్టం కొంతమందిని మాత్రమే వరిస్తుంది. స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల నీరాజనాలు అందుకోవడం అంటే... అబ్బురపరిచే యాక్టింగ్ స్కిల్స్ తో పాటు మైమరిపించే అందం కూడా ఉండాలి. ఈ రెండూ ఉన్న ఓ హీరోయిన్ ఏకంగా 50 సెకండ్ల కోసం 5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఎదిగి, హీరోయిన్లలోనే సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఒక్కసారి స్టార్ హీరోయిన్ గా పేరు ప్రతిష్టలు వచ్చాక వివాదాల బారిన పడని హీరోయిన్లు ఉండరు అనేది వాస్తవం. అలాగే వాళ్లపై వచ్చే రిలేషన్ షిప్ రూమర్స్ కు కూడా అడ్డూ అదుపూ ఉండదు. ఈ రెండిట్లోనూ ఈ హీరోయిన్ పేరు మార్మోగిపోయింది. అయినప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ గా, హీరోలకు పోటీ ఇచ్చే విధంగా సినిమాలలో దూసుకెళ్తూ, 200 కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యింది. మరి ఈ హీరోయిన్ ఎవరో ఇంకా గుర్తుపట్టలేదా...? ఆమె మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార.
50 సెకండ్లకే 5 కోట్లు
నిమిషానికి కోటి రూపాయలు డిమాండ్ చేసిన స్టార్ హీరోయిన్ గురించి విన్నాం మనం ఇప్పటిదాకా. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెల ఖాతాలో సరైన హిట్స్ లేనప్పటికీ, యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఫలితంగా ఈ బ్యూటీకి నిమిషానికి కోటి రూపాయలు డిమాండ్ చేసినా ఇవ్వడానికి నిర్మాతలు సంతోషంగా అంగీకరిస్తున్నారు. అయితే లేడీ సూపర్ స్టార్ ఆమెకు మించిన పవర్ ఫుల్ హీరోయిన్ అని చెప్పాలి.
సాధారణంగానే స్టార్ డమ్ వచ్చిన తర్వాత హీరోలు హీరోయిన్లు బ్రాండ్ ప్రమోషన్స్ తో మరింత సంపాదనను వెనకేసుకుంటారు. అలాగే నయనతార సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్లలో కూడా కనిపిస్తుంది. అయితే ఓ శాటిలైట్ డిష్ కంపెనీ కోసం ఈ బ్యూటీ ఏకంగా 5 కోట్లు పారితోషికంగా తీసుకుందని టాక్. ఈ యాడ్ కేవలం 50 సెకండ్లు మాత్రమే ఉండడం విశేషం. దీంతో ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే నటీమణులలో ఒకరిగా నయనతార రికార్డును క్రియేట్ చేసింది. ఇది చిత్ర పరిశ్రమలో ఆమె క్రేజ్, పవర్ ఏంటో నిరూపించే ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.
నయనతారకు 200 కోట్ల ఆస్తులు
ఇక నయనతార ఆస్తుల విషయానికొస్తే 200 కోట్లకు అధిపతి ఆవిడ. చెన్నైలో ఆమెకు 100 కోట్ల విలువైన ఇల్లు, ఒక ప్రైవేట్ జెట్, మెర్సడెస్ మేబ్యాక్, బీఎండబ్ల్యూ సిటీ సెవెన్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. 20 సంవత్సరాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార తెలుగు, తమిళ, మలయాళ హిందీ భాషల్లో దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది.
చంద్రముఖి, గజినీ, శ్రీరామరాజ్యం వంటి సినిమాలతో సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ 2023లో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. 'జవాన్'తో 1000 కోట్ల మూవీని తన ఖాతాలో వేసుకుంది. ఇక నయనతార ఇండస్ట్రీలోని అగ్రనటులు అందరితోనూ కలిసి తెరపై కనిపించింది. అలాగే ఆమె జీవితంలో వివాదాలు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రభుదేవా, శింబులతో ప్రేమాయణం, ప్రమోషన్స్ కి హాజరు కాకపోవడం నుంచి మొదలు పెడితే ఇప్పుడు నడుస్తున్న ధనుష్ వివాదం కూడా అందరికీ తెలిసిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

