AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
AR Rahman Hospitalised: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆదివారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు.

AR Rahman Hospitalised Due To Chest Pain: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఆయన ఛాతీ నొప్పితో ఇబ్బంది పడగా.. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర విభాగంలో యాంజియోగ్రఫీ చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న రెహ్మాన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికంగా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, రెహమాన్ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం స్థితిపై ప్రకటన జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం లండన్ వెళ్లిన రెహ్మాన్ ఇటీవలే చెన్నైకి తిరిగివచ్చారు. అక్కడ ఓ సంగీత కళాశాలతో కలిసి కచేరీ నిర్వహించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రెహమాన్ ఇటీవలే 'ఛావా' సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వచ్చిన 'RC16' మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. ఈ మూవీలో ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేసినట్లు ఇటీవలే వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

