YS Sharmila: జనసేన కాదు ఇది "మత సేన, చేగువేరా, గద్దర్ ఆశయాలకు పవన్ నీళ్లు: వైఎస్ షర్మిల
జనసేన కాదు ఇది "మత సేన ": YS షర్మిల పవన్ గారూ.. బీజేపీ మైకం నుండి బయటపడండి :షర్మిల

జనసేన పార్టీని " ఆంధ్ర మత సేన " పార్టీగా మార్చేసారు అంటూ పవన్ కళ్యాణ్ పై తొలిసారి విరుచుకుపడ్డారు ఏపీ సి సి ప్రెసిడెంట్ షర్మిల రెడ్డి. పవన్ కళ్యాణ్ ని బాహాటంగా ఇలా విమర్శించడం షర్మిల కి ఇదే మొదటి సారి కావడం విశేషం. పిఠాపురంలో జరిగిన " జయ కేతన" సభ తర్వాత పవన్ కళ్యాణ్ స్పీచ్ పై ఏపీ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే తులసి రెడ్డి " జనసేన రద్దు చేసి బిజెపిలో విలీనం చేయాలంటూ " విమర్శించారు. ఇప్పుడు ఏకంగా పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో వైయస్ షర్మిల జనసేన ను "మతసేన" గా వర్ణించారు.
చేగువేరా, గద్దర్ ఆశయాలకు పవన్ నీళ్లు వదిలేసారు : షర్మిల
పవన్ కళ్యాణ్ మారిపోయారని చేగువేరా, గద్దర్ ఆశయాలకు నీళ్లు వదిలేసి మోడీ అమిత్షాల ఆశలను ఆదర్శం గా గా తీసుకుంటున్నారని అన్నారు షర్మిల రెడ్డి. ఆ మేరకు ఆమె ఒక ప్రకటన రిలీజ్ చేశారు. RSS భావజాలాన్ని నరనరాన ఎక్కించుకున్న పవన్ కళ్యాణ్ సర్వమత సమైక్యతతో వర్ధిల్లే ఆంధ్ర రాష్ట్రాన్ని "విభజించు పాలించు " సూత్రంతో మత విద్వేషాలకు నిలయంగా మారుస్తున్నారన్నారని అన్నారామె. జనసేన స్వాతంత్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిజెపి భావజాలంతో ఒక మత ప్రయోజనాలకే పెద్దపీట వేసేలా మారిపోవడం దురదృష్టం అన్నారు. 11 ఏళ్ళు పోరాడి ఉప ముఖ్యమంత్రి పదవి దాకా ఎదిగిన పవన్ కళ్యాణ్ వెంటనే బిజెపి మైకం నుంచి బయటపడాలని సూచించారు షర్మిల.
షర్మిల ఎక్కడ?
వైయస్ షర్మిల ఎక్కడ అనే ప్రచారం ఈమధ్య జోరుగా సాగుతోంది. చాలాకాలంగా ఆమె మీడియా ముందుకు వచ్చింది లేదు. విదేశాల్లో ఉన్న కుమార్తె దగ్గరకు వెళ్లారని ఆమె సన్నిహితులు చెబుతుంటే హైదరాబాదులోనే ఉన్నారని ఏపీ కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజుకోరకంగా మారిపోతున్న తరుణంలో వైయస్ షర్మిల ఎక్కడ అంటూ ఆమె ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదిక గా ప్రశ్నిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

