Pushpa 3 Movie: 'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్
Producer Ravi Shankar: అల్లు అర్జున్ 'పుష్ప 3' మూవీ రిలీజ్‌పై నిర్మాత రవిశంకర్ అధికారికంగా ప్రకటించారు. నితిన్ 'రాబిన్ హుడ్' మూవీ ప్రెస్ మీట్‌లో కీలక అప్ డేట్ ఇచ్చారు.

Producer Ravi Shankar Announced Pushpa 3 Release Date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'పుష్ప 2'. పుష్ప ఫ్రాంచైజీతో రికార్డులు తిరగరాశారు బన్నీ. 2021లో విడుదలైన పుష్ప.. దానికి సీక్వెల్‌గా 2024లో రిలీజైన 'పుష్ప 2: ది రూల్' (Pushpa 2: The Rule) సంచలన విజయాలు సాధించిన విజయం తెలిసిందే. మరి 'పుష్ప 3' ఎప్పుడు అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
'పుష్ప 3' రిలీజ్ అప్పుడే..
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు, బన్నీ ఫ్యాన్స్ సైతం 'పుష్ప 3' (Pushpa 3: The Rampage) అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో నిర్మాత రవిశంకర్ (Ravi Shankar) వారికి గుడ్ న్యూస్ చెప్పారు. 2028లో పుష్ప 3 సినిమా రిలీజ్ చేస్తామని తెలిపారు. విజయవాడలో ఆదివారం జరిగిన 'రాబిన్ హుడ్' (Robin Hood) మూవీ ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. అంతే కాకుండా బన్నీ ప్రస్తుతం అట్లీతో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయాన్ని కూడా బయటపెట్టారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై 'తగ్గేదేలే..' అంటూ ర్యాంపేజ్ చూస్తామని కామెంట్స్ చేస్తున్నారు.
పార్ట్ 2లోనే హింట్ ఇచ్చేశారుగా..
నిజానికి పుష్ప 2 మూవీకి సీక్వెల్‌పై క్లైమాక్స్‌లోనే డైరెక్టర్ సుకుమార్ హింట్ ఇచ్చేశారు. అది ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. అయితే, 'పుష్ప 3: ది ర్యాంపేజ్' ఉంటుందని తెలిసినా ఫ్యాన్స్‌లో ఎప్పుడనే సస్పెన్స్ మాత్రం అలానే ఉండిపోయింది. పుష్ప రాజ్‌పై ఓ వ్యక్తి బాంబు దాడికి పాల్పడిన సీన్‌తో సినిమాను సస్పెన్స్‌గా ముగించారు.
పుష్ప 2 రిలీజ్‌కు ముందు విడుదల చేసిన ఓ ట్రైలర్‌లోనూ రెండో పార్ట్‌కు సంబంధించి ఎలాంటి సీన్స్ సింక్ కాకపోవడంతో అది పుష్ప 3 ట్రైలర్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. పుష్ప 2 సక్సెస్ మీట్‌లోనూ సుకుమార్ సీక్వెల్‌పై కామెంట్ చేస్తూ.. బన్నీని ఓ మూడేళ్లు తనతో వదిలేయాలంటూ సరదాగా కామెంట్ చేశారు. తాజాగా.. నిర్మాత రవిశంకర్ సైతం పుష్ప 3పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
Also Read: పవన్ మూవీ టైటిల్‌తో హీరోగా యాంకర్ ప్రదీప్ - 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రిలీజ్ డేట్ ఫిక్స్
పార్ట్ 3లో విజయ్ దేవరకొండ
'పుష్ప 3'లో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటిస్తున్నారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. దీనిపై హీరోయిన్ రష్మిక సైతం స్పందించారు. దర్శకుడు సుకుమార్ ప్రతీ విషయంలోనూ సస్పెన్స్ కొనసాగిస్తారని.. చివరి వరకూ విషయాన్ని బయటపెట్టరని చెప్పారు. ప్రేక్షకుల మాదిరిగానే నేను కూడా క్లైమాక్స్‌లో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
రికార్డులు కొల్లగొట్టేసిన 'పుష్ప'
పుష్ప ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన పుష్ప, పుష్ప 2 మూవీస్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రధానాంశంగా ఈ మూవీస్‌ని జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఓ సాధారణ ఎర్రచందన కూలీగా ప్రయాణం మొదలుపెట్టిన 'పుష్ప' సిండికేట్ లీడర్‌గా ఎలా ఎదిగాడు.? సిండికేట్ లీడర్ అయిన తర్వాత జరిగిన పరిణామాలేంటి.? అనేది రెండు భాగాల్లో చూపించారు.
మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా పుష్ప 2 సినిమాలో విలనిజం చూపించారు. ఇతర ప్రధాన పాత్రల్లో ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ నటించారు. అల్లు అర్జున్ కెరీర్‌లోనే పుష్ప ఓ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 75 రోజుల్లో రూ.1,871 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. 2024లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా 'పుష్ప 2' నిలవడమే కాకుండా.. మూవీ విడుదలైన 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ మూవీగా నిలిచింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

