Tollywood Heroines: రష్మిక, శ్రీలీల to సమంత, సాయి పల్లవి వరకూ... టాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఏ కాలేజీల్లో ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?
Tollywood actresses : రష్మిక మందన్న, శ్రీలీల, సాయి పల్లవి, సమంత, అనుష్క వంటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఏ కాలేజ్ లో, ఎంత వరకు చదువుకున్నారో తెలుసా ?

టాలీవుడ్ హీరోయిన్లు రష్మిక, శ్రీలీల, సాయి పల్లవి, అనుష్క వంటి హీరోయిన్లు పాన్ ఇండియా రేంజ్ లో దూసుకెళ్తున్నారు. ఇక ఈ హీరోయిన్లంతా సౌత్ నుంచే వచ్చినప్పటికీ అన్ని భాషల ప్రేక్షకులు ఆరాధిస్తున్నారు. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్న హీరోయిన్ల గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు బాగా ఆసక్తిని కనబరుస్తారు. అందుకే వాళ్ల గురించిన వివరాలని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడైనా ఈ హీరోయిన్లు ఎంత వరకు చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారు ? అనే విషయాలను ఆలోచించారా? చాలామంది హీరోయిన్లు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు డిగ్రీలు సైతం పూర్తి చేశారు. మరికొంతమంది డాక్టర్ పట్టాలు అందుకున్నారు.
రష్మిక మందన్న
నేషనల్ క్రష్ గా, పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తున్న రష్మిక డబుల్ గ్రాడ్యుయేట్. ఆమె ఎమ్మెస్ రామయ్య కాలేజీలో సైకాలజీ, జర్నలిజం అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీలు పొందింది.
తమన్నా
తమన్నా మానెక్జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్‌లో పాఠశాల విద్యను కంప్లీట్ చేసింది. ముంబైలోని నేషనల్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని కంప్లీట్ చేసింది.
సాయి పల్లవి
నేచురల్ బ్యూటీగా తన సహజ నటనతోనే పాపులర్ అయిన హీరోయిన్ సాయి పల్లవి. మేకప్ లేకుండానే సినిమాలలో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ఈ హీరోయిన్ డాక్టర్. ఆమె టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నితీష్ తివారి రామాయణంలో సీతగా నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీలీల
ఇప్పటికే సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల ఇప్పుడు నార్త్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ హీరోయిన్ కూడా ఒక డాక్టరే. ఆమె తల్లి గైనకాలజిస్ట్. శ్రీలీల 2021లో ఎంబిబిఎస్ డిగ్రీని పూర్తి చేసింది.
సమంత
సమంత చెన్నైలోని హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. తర్వాత ఆమె చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల నుంచి బిజినెస్ డిప్లొమాలో పట్టభద్రురాలైంది.
త్రిష
చెన్నై చిన్నది త్రిష దశాబ్ద కాలంగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు చెన్నైలోని ఎతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని పూర్తి చేసింది.
అనుష్క శెట్టి
'బాహుబలి'తో దేవసేనగా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది. ఆమె బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్లో డిగ్రీని పూర్తి చేసింది.
ఇక నిత్యా మీనన్ మణిపాల్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం, శృతిహాసన్ ముంబైలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజ్ నుంచి సైకాలజీలో, పూజా హెగ్డే ఎంఎంకె కాలేజ్ లో బీకాం డిగ్రీలను పూర్తి చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

