Virat Kohli: RCB IPL కప్ కొట్టడమే విరాట్ కోహ్లీ కెరీర్‌కు పరిపూర్ణ ముగింపు- ఏబీ డివిలియర్స్
TATA IPL లో RCB కప్ కొడితే విరాట్ కోహ్లీ అద్భుతమైన కెరీర్‌కు పర్‌ఫెక్ట్ ముగింపు వస్తుందని అన్నాడు అతని పూర్వ సహచరుడు ఏబీడివిలియర్స్. Jio Hotstar లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచం చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు.. లెక్కలేనన్ని ఘనతలు ఉన్న అతనికి IPL కప్ లేకపోవడమే లోటు. TATA IPL లో RCB కప్ కొడితే విరాట్ కోహ్లీ అద్భుతమైన కెరీర్‌కు పర్‌ఫెక్ట్ ముగింపు వస్తుందని అన్నాడు అతని పూర్వ సహచరుడు ఏబీడివిలియర్స్ Jio Hotstar లోని క్రికెట్ విశ్లేషణ కార్యక్రమం Powerplay లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
IPL సీజన్ మొదలైనప్పుటి నుంచి RCB సీజన్ ఫేవరెట్లలో ఒకటి. కొన్నిసార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ కప్పు మాత్రం వాళ్లకి అందని ద్రాక్షనే అయింది. ప్రతీసారి ఈ సారి కప్పు నమ్మదే.. అనుకోవడమే కానీ.. ఆ ఆశ మాత్రం తీరడం లేదు. తన కెరీర్ ప్రారంభం అయినప్పటి నుంచి RCBలోనే ఉంటున్న విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడికి కూడా ఇది తీరని లోటే. క్రికెట్ ప్రపంచంలో సచిన్ తర్వాత ఆ స్థాయిలో రికార్డులు ఉన్న విరాట్ ఐపీఎల్ కప్పు కోసం మాత్రం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. కొన్ని సార్లు తన చేతిలోకి వచ్చినట్లే వచ్చి కప్పు చేజారిపోతూ ఉండేది. రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న విరాట్‌కు ఐపీఎల్ తీరని కలగా మిగిలిపోయింది. అది కూడా తన ఘనతల్లో చేరితే అది అతని కెరీర్ కు పరిపూర్ణ ముగింపు అని అతనితో క్రికెట్ ఆడిన సహచరులు అంటున్నారు.
జియోహాట్‌స్టార్ ప్రత్యేక క్రికెట్ విశ్లేషణ షో ‘పవర్ ప్లే’ లో, టాటా IPL నిపుణులు ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, గ్రేమ్ స్మిత్, స్కాట్ స్టైరిస్, ఆకాశ్ చోప్రా లు RCB గత సీజన్ ప్రదర్శన, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విధానం గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ తక్కువా..?
గ్రేమ్ స్మిత్:
"కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి వచ్చిన విమర్శలు అనవసరమైనవి. గత సీజన్‌లో అతను ఒంటరిగా RCB బ్యాటింగ్‌ను మోశాడు. జట్టు మిగతా బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయినప్పుడు, అతనిపై మరింత భారం పడింది."
ఏబీ డివిలియర్స్:
"విరాట్ స్ట్రైక్ రేట్‌పై జరిగిన చర్చలన్నీ నిరాధారమైనవి. జట్టు అవసరాన్ని బట్టి అతను బ్యాటింగ్ చేశాడు. అతనికి మరో ఎండ్‌లో విశ్వసనీయమైన భాగస్వామి లభిస్తే, అతను పూర్తి స్వేచ్ఛతో ఆడతాడు. అయితే, ఆ నమ్మకం లేకపోతే, అతను జట్టును ఆదుకునే బాధ్యత తీసుకుంటాడు."
స్కాట్ స్టైరిస్:
"పవర్‌ప్లేలో కోహ్లీ స్ట్రైక్ రేట్ ఎప్పుడూ సమస్య కాదు. కానీ ఆ తర్వాత అతను తన ఆటను వేగంగా మార్చాల్సిన అవసరం ఉంది."
షేన్ వాట్సన్:
"కొత్త తరహా T20 క్రికెట్‌లో నిలదొక్కుకోవాలంటే, విరాట్ తన షాట్ల ఎంపికను మరింత మెరుగుపరుచుకోవాలి. రిస్క్ తీసుకుని తన స్కోరింగ్ రేటును పెంచుకోవాలి."
RCB మేనేజ్‌మెంట్‌పై వెంకటేశ్ ప్రసాద్ విమర్శలు
"ఒక జట్టును మేనేజ్‌మెంట్ ఎలా డీల్ చేస్తుందన్నది కూడా ముఖ్యమైన విషయం. RCB టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఇది లోపించింది. ఇతర జట్లు లోకల్ టాలెంట్‌ను పెంచేందుకు కృషి చేస్తున్నాయి. కానీ RCB ఆ దిశగా పెద్దగా అడుగులు వేయడం లేదు. వాళ్లకు బ్రాండ్ బిల్డింగ్ మీద ఉన్న శ్రద్ధ టైటిల్ గెలవడం మీద ఉండదు. ఆటగాళ్లకు తగిన విధంగా సపోర్ట్ చేస్తేనే కదా.. వాళ్లు విజయం సాధించగలరు."
విరాట్ ఆటతీరు మారుతోంది.
ఆకాశ్ చోప్రా:
" తన కేరీర్‌లో ఈ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా విరాట్ ఇప్పటికీ తనను తాను మెరుగుపరుచుకుంటున్నాడు. తన అడ్డంకులకు అధిగమిస్తున్నాడు. కొత్త షాట్లను ఎంచుకుంటున్నాడు. ఒక చాంఫియన్ మాత్రమే అలా చేయగలడు."
మైక్ హెస్సన్:
"కేవలం స్కోర్ రోటేట్ చేస్తే మాత్రమే సరిపోదు.. స్కోరు వేగాన్ని పెంచాలన్న ఉద్దేశ్యంతో విరాట్ ఇప్పుడు స్లాగ్ స్వీప్ లాంటి షాట్లను తన ఆటలో భాగం చేసుకున్నాడు.."
ఏబీ డివిలియర్స్:
" విరాట్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి, కొత్త షాట్లు ఆడుతుంటుడం చూడటానికి చాలా బాగుంది. కొత్త షాట్లు ఆడటం… గేమ్ కు సంబంధించిన డిఫరెంట్ యాస్పెక్ట్స్ ప్రదర్శించడం నిజంగా గొప్ప విషయమే. అతనిలో ఆ సత్తా ఎప్పుడూ ఉంది. RCB IPL గెలవడం అతని అద్భుతమైన కెరీర్‌కు పరిపూర్ణ ముగింపు అవుతుంది. అతని స్ట్రైక్ రేట్ గురించి ఆందోళన అనవసరం. కిందటి సీజన్‌లో అద్భుతంగా ఆడాడు. జట్టు బ్యాటింగ్ భారాన్ని మొత్తాన్ని తానే మోశాడు. టీమ్ మేనెజ్‌మెంట్ అతనికి ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేశాడు. విరాట్ లాంటి ఆటగాడిని వేరే ఏదో ఫ్రాంచైజ్‌లో ఉన్న కొత్త ఆటగాడితో పోల్చలేం కదా.. విరాట్‌కు ఉన్న బాధ్యతలు వేరు. క్వాలిఫికేష్ మ్యాచ్‌ల్లో RCB గెలుపులకు పూర్తి క్రెడిట్ అతనిదే”
రాబిన్ ఉతప్ప:
"విరాట్ లాంటి ఆటగాళ్లలో ఎదుగుదల అనేది ' ఒక నాచురల్ ప్రాసెస్. అది ఎప్పుడు' జరిగేదనేదే తప్ప, 'జరుగుతుందా?' అనే సందేహం అసలే లేదు. అతని బ్యాటింగ్ పరిణతి చూసినప్పుడు, అది మరింత స్పష్టమవుతోంది."
RCB కిందటి సీజన్‌పై…
బ్రెట్ లీ:
"RCBని మొదట్లో చాలా మంది పట్టించుకోలేదు. కానీ నేను వాళ్లను టాప్-కంటెండర్స్‌గా ఎంచుకున్నాను. చివరికి వాళ్ల ప్రయాణం సాగిందో చూశాం కదా.."
ఆకాశ్ చోప్రా:
"ఒక దశలో, RCB ప్లే-ఆఫ్స్ చేరే అవకాశాలు జీరో అనిపించింది. కానీ వాళ్లు చాలా హోప్‌తో చివరి వరకూ పోరాడారు. ఆ నమ్మకమే వాళ్ల ఆటతీరులో కనపడింది. వాళ్లు కప్ గెలవకపోవచ్చు కానీ సీజన్ ముగిసే సమయానికి, జట్టు గర్వపడే విధంగా నిలిచింది."
RCB కమ్ బ్యాక్‌పై పూర్తి విశ్లేషణలు క్రికెట్ ప్లేయర్లు చేసిన విశ్లేషణలు… JioHotstar ‘Power Play’ లో ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

