Serial Actress Kavya: అరేంజెడ్ మ్యారేజ్ Vs లవ్ మ్యారేజ్ అంటే నో మ్యారేజ్ - ఆ వ్యక్తిని మైండ్‌లోంచి తీసేశానన్న బుల్లి తెర స్టార్ కావ్య
TV Star Kavya: తనకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని బుల్లితెర స్టార్ కావ్య చెప్పారు. అవకాశం వస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన నటించాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Serila Actress Kavya About Marriage: కావ్య.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ షో తర్వాత ఆమె లీడ్ రోల్‌లో 'చిన్ని' సీరియల్‌లో (Chinni Serial) నటిస్తున్నారు. ఓ చిన్నారికి తల్లి పాత్రలో ఆమె నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, తన కెరీర్ అంశాలపై పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
'అసలు పెళ్లే చేసుకోను'
తాను అసలు పెళ్లే చేసుకోనని కావ్య (Actress Kavya) చెప్పారు. అరేంజెడ్ మ్యారేజ్ Vs లవ్ మ్యారేజ్ అనే ప్రశ్నకు 'నో మ్యారేజ్' అంటూ సమాధానమిచ్చారు. 'నేను అసలు పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. నాకు లైఫ్‌లో బాగా చిరాకు తెప్పించిన పర్సన్ అంటే ఒకప్పుడు ఉండేవాడు. కానీ ఇప్పుడు అతన్ని నా మైండ్‌లోంచి తీసేశాను. ఎవర్నీ బాధ పెట్టకూడదు. ఎవర్నీ మోసం చేయకూడదు. ఇదే నేను జీవితంలో నేర్చుకున్న పాఠం.' అని కావ్య చెప్పారు.
నా డ్రీమ్ బాయ్ అంటే..
తన డ్రీమ్ బాయ్ పలానా హీరోలా ఉండాలని తానేం కలలు కనలేదని కావ్య చెప్పారు. 'నన్ను, నా ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలు. కేరింగ్‌గా ఉంటే చాలు అనుకున్నా. నాకు కోపం వచ్చినా బాధ వచ్చినా వెంటనే తీర్చేసుకుంటాను. ఏడ్చేయడమో, తిట్టేయడమో చేస్తాను. నాకు హీరోయిన్‌గా ఛాన్స్ వస్తే ఎవరితోనైనా చేస్తా. నాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయనతో మూవీ చేయాలని ఉంటుంది. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే హ్యాపీగా ఫీలయ్యే పర్సన్ అమ్మ. నన్ను ఆన్ స్క్రీన్‌పై చూడాలన్న ఆమె కలను నెరవేర్చాను. నాకు క్రష్ అంటే ఎవరూ లేరు. కానీ అల్లు అర్జున్ గారంటే చాలా ఇష్టం.' అని తెలిపారు.
బిగ్ బాస్ తర్వాత..
బిగ్ బాస్ తర్వాత కావ్య చిన్ని సీరియల్‌లో నటిస్తున్నారు. ఇదే సీరియల్‌లో బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ సైతం ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ ఇంతకు ముందు సైతం పలు సీరియల్స్‌లో నటించారు. అప్పట్లో లవ్‌లో పడగా.. ఆ తర్వాత బ్రేకప్ అయ్యింది. బిగ్ బాస్ షో తర్వాత బయటకు వచ్చిన నిఖిల్ కావ్యకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. రెండు, మూడు కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు. అయితే, తనకు ప్రేమ మీద నమ్మకం పోయిందని పలు సందర్భాల్లో కావ్య నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక 'చిన్ని' సీరియల్‌లో ఏసీపీ విజయ్‌గా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. కావ్యను ఢీకొట్టే పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పుడు కావ్య వర్సెస్ నిఖిల్ అన్నట్లు సీరియల్ ముందుకు సాగుతూ ఉండడం వీక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. ప్రస్తుతం 225 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌లో కొత్తగా ఓ క్యారెక్టర్ సైతం ఎంటరైంది. 'చిన్ని'లో కుందన పాత్ర చేసే అవకాశం గీతూ రాయల్ సొంతం అయ్యింది. మరో బుల్లితెర పాపులర్ ఆర్టిస్ట్ 'జబర్దస్త్' పవిత్ర కూడా ఇటీవల ఈ సీరియల్ నటీనటుల జాబితాలో చేరింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

