Prithvi Shaw Down Fall: పృథ్వీ షా గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ఐపీఎల్ స్టార్ శశాంక్ సింగ్.. అవి మార్చుకుంటే, తనకు తిరుగేలేదు..!
భారత్ తరపున ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టీ20 ఆడిన షా.. ఆ తర్వాత జాతీయ జట్టు కాదు కదా.. కనీసం డొమెస్టిక్ లెవల్లో కూడా సత్తా చాట లేక పోయాడు. అతని గురించి శశాంక్ సింగ్ వ్యాఖ్యానించాడు.

IPL Star Shashank Singh Tells About Shaw: భారత క్రికెట్ లో పృథ్వీ షాది ప్రత్యేకమైన ప్రస్థానం అనడంలో సందేహం లేదు. మరో సచిన్ టెండూల్కర్ అనుకున్న వ్యక్తి ఇప్పుడు అనామకంగా మిగిలాడు. ఎంతవేగంగా అంతర్జాతీయ యవనికలో అడుగు పెట్టాడో అంతే వేగంగా తెరమరుగైయ్యాడు. భారత్ తరపున ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టీ20 ఆడిన షా.. ఆ తర్వాత జాతీయ జట్టు కాదు కదా.. కనీసం డొమెస్టిక్ లెవల్లో కూడా సత్తా చాట లేక పోయాడు. తాజాగా అతని గురించి షా మిత్రుడు, ఐపీఎల్ సంచలనం శశాంక్ సింగ్ వ్యాఖ్యానించాడు. తనకు 13 ఏళ్ల వయుసున్నపటి నుంచి షా తనకు తెలుసని, కొన్ని కారణాల వల్ల అతని డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని వ్యాఖ్యానించాడు. నిజానికి షాకు ఇప్పుడు చాలా కష్టకాలం నడుస్తోంది. ఐపీఎల్ 2025లో అన్ సోల్డ్ గా మిగిలిన షా.. విజయ్ హజారేట్రోఫీ, రంజీ ట్రోఫీలలో ముంబై జట్టు నుంచి కూడా ఉద్వాసనకు గురయ్యాడు. తాజాగా రూట్ మొబైల్ కప్పులో తను బరిలోకి దిగాడు.
అండర్ రేటెడ్ క్రికెటర్..
షా చాలా అండర్ రేటెడ్ క్రికెటర్ అని, తను సత్తా చాటడం భారత క్రికెట్ కు ముఖ్యమని శశాంక్ అభివర్ణించాడు. యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ స్థాయిలో తను ఓపెనర్ గా ఎదిగేవాడని, అయితే కొన్ని కారణాల వల్ల తన డౌన్ ఫాల్ ప్రారంభమైందని పేర్కొన్నాడు. ఇప్పటికైనా కొన్ని మార్పులు చేస్తే, తను తిరిగి గాడిలో పడతాడని పేర్కొన్నాడు. పది గంటలకే పడుకోవడం, స్ట్రిక్టు డైట్ పాటించడం, మరికొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా తను బౌన్స్ బ్యాక్ కాగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మార్పులతో తనకు ఎదురే ఉండబోదని వ్యాఖ్యానించాడు.
గత సీజన్ లో అనూహ్యంగా..
నిజానికి గత సీజన్ శశాంక్ సింగ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వేలంలో అనూహ్యంగా శశాంక్ ను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్ కు లక్కు కలిసొచ్చింది. ఈ సీజన్లో 165 స్ట్రైక్ రేట్ తో 354 పరుగులు సాధంచాడు. ఎన్నో మ్యాచ్ ల్లో కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. పంజాబ్ తో పాటు మిగతా క్రికెట్ ప్రేమికుల మనసు దోచాడు. దీంతో అతనిపై ఫ్రాంచైజీ ఎనలేని విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. పంజాబ్ తరపు మొట్టమొదటి రిటెన్షన్ గా శశాంక్ నే ఎంచుకోవడం విశేషం. 5.5 కోట్ల రూపాయలతో తనను రిటైన్ చేసుకుంది. తను అన్ క్యాప్డ్ ప్లేయర్ కాబట్టి, ఆ ధర పలికింది. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించి క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఉన్నట్లయితే తనకు భారీ ధర పలికేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక గతేడాది గూగుల్లో అత్యధిక మంది సెర్చ్ చేసిన అథ్లెట్లలో శశాంక్ పేరు ప్రముఖంగా నిలిచింది. ఒక్క హార్ధిక్ మాత్రమే ఈ జాబితాలో టాప్-10లో నిలిచాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగనున్న శశాంక్.. నూతన సారథి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడనున్నాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

