Watch IPL 2025 For Free: ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడండి - జియో సరికొత్త రీఛార్జ్ ఆఫర్
IPL 2025 Season: క్రికెట్ ప్రేమికులు జియో హాట్‌స్టార్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఉచితంగా చూడటానికి వీలు కల్పించే ప్రత్యేక టారిఫ్ ప్లాన్‌లను రిలయన్స్ జియో ప్రకటించింది.

How to Watch IPL for Free on JioHotstar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ (IPL 2025 Season) మన ముందుకు వచ్చింది & శనివారం (22 మార్చి 2025) నుంచి ప్రారంభం అవుతుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ఈ సీజన్ ఓపెన్ అవుతుంది. కొత్త స్టార్లు పుట్టుకొచ్చే, మెరుపులు మెరిసే, రికార్డ్‌లు బద్ధలయ్యే IPL మ్యాచుల్లో ప్రతి బాల్‌ను మిస్ కాకుండా చూడంలంటే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఉండాలి. క్రికెట్ అభిమానులు కొన్ని టారిఫ్ ప్లాన్‌లతో జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను (IPL Matches On JioHotstar) ఉచితంగా చూడవచ్చని రిలయన్స్ జియో (Reliance Jio) ప్రకటించింది.
భారతదేశంలో అతి పెద్ద యూజర్ బేస్ ఉన్న టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో, మార్చి 17న ఓ కొత్త ప్రకటన చేసింది. రూ. 299 కంటే ఎక్కువ మొత్తానికి జియో సిమ్‌ను రీఛార్జ్ చేస్తే, ఆ యూజర్ రాబోయే రెండున్నర నెలల పాటు IPLను ఉచితంగా చూడటానికి వీలవుతుందని జియో వెల్లడించింది. క్రికెట్ ప్రేమికులను క్షణక్షణం టెన్షన్ పెట్టి, అద్భుతమైన థ్రిల్‌ను పంచే IPL 2025 ఈవెంట్ మార్చి 22 నుంచి మే 25 వరకు (IPL 2025 Schedule) జరుగుతుంది.
JioHotstarలో IPL మ్యాచ్‌లను ఉచితంగా ఎలా చూడాలి? (How to watch IPL matches for free on JioHotstar?)
మార్చి 17 - మార్చి 31 తేదీల మధ్య Jio SIMని రీఛార్జ్ చేయండి లేదా కొనుగోలు చేయండి.
ప్రస్తుత జియో వినియోగదారులు: రోజుకు కనీసం 1.5 GB అందించే రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ ప్లాన్ తీసుకోవాలి.
కొత్త జియో వినియోగదారులు: రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ ప్లాన్‌తో కలిపి కొత్త జియో సిమ్ (Jio SIM) కొనుగోలు చేసి & యాక్టివేట్ చేయాలి.
యాడ్-ఆన్ డేటా ప్లాన్: మార్చి 17 కంటే ముందు రీఛార్జ్ చేసిన వినియోగదారులు 100 యాడ్-ఆన్ ప్యాక్‌ను కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ పొందవచ్చు.
జియో సినిమాలో మ్యాచ్‌లు చూడడం కదరదు
రిలయన్స్-డిస్నీ జాయింట్ వెంచర్‌గా ఉన్న పాత జియో సినిమా (JioCinema) ప్లాట్‌ఫామ్‌లో 2023, 2024లో IPL మ్యాచ్‌లను పూర్తిగా ఉచితంగా స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు ఆ ఫ్లాట్‌ఫామ్‌లో మ్యాచ్‌లు రావు, జియో హాట్‌స్టార్‌లో మాత్రమే చూడాలి. జియో హాట్‌స్టార్‌లో ఇప్పుడు కొత్తగా హైబ్రిడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో, కొంత సమయం వరకు మాత్రమే ఫ్రీగా కంటెంట్ చూసేందుకు వీలవుతుంది, నిర్దిష్ట పరిమితి తర్వాత సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.
50 రోజులు ఫ్రీగా హై-స్పీడ్ ఇంటర్నెట్ (Free high-speed internet for 50 days)
కొత్త ప్లాన్‌లో రిలయన్స్ జియో "హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్" కోసం 50 డేస్ ట్రయల్ కూడా ఉంది. అంటే, జియో ఫైబర్ లేదా ఎయిర్ ఫైబర్‌ను 50 రోజుల పాటు "ఉచితం"గా అందిస్తారు. ఇంట్లో కూర్చుని ఎలాంటి అవాంతరాలు లేకుండా క్రికెట్ సహా అన్ని రకాల కంటెంట్‌ను చూసేందుకు హై-స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడం ఈ ప్లాన్ ఉద్దేశం. తద్వారా, హోమ్ ఇంటర్నెట్ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని పెంచుకోవడం రిలయన్స్ లక్ష్యం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

