Konaseema Crime News: ఇద్దరు బిడ్డలను కాలువలోకి తోసి పరారైన తండ్రి, కోనసీమ జిల్లాలో దారుణం
కాకినాడలో ఓ తండ్రి ఉదంతం మరవకముందే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరో తండ్రి ఘాతుకం చోటుచేసుకుంది.. తన ఇద్దరి పిల్లల్ని స్కూటీపైతీసుకెళ్లి కాలువలో తోసేసిన సంఘటనలో చిన్నారి మృతిచెందింది..

Andhra Pradesh News | రామచంద్రపురం : పోటీ ప్రపంచంలో తన పిల్లలు బ్రతకలేరన్న నెపంతో ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కాకినాడ ఉదంతం మరువక ముందే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరో సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.. ఓ కసాయి తండ్రి తన పిల్లల్ని తనతోపాటే తీసుకుని వెళ్లి కాలువలో తోసేసిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.. కుమారుడు సందీప్(10) కాలువలో ఈదుకుంటే బయట పడగా చిన్నారి కారుణ్య(6) మృత్యువాత పడిరది.. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన తండ్రి పిల్లి రాజు(40) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.. అతను ఎక్కడికైనా పారిపోయాడడా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు... ఈ దారుణ సంఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గ్రామ పరిధిలోని గణపతినగర్ లాకుల వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది..
సరదాగా బండిపై తిప్పుతానని తీసుకెళ్లి..
రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే వ్యక్తికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం సాయంత్రం పిల్లలు సందీప్, కారుణ్యలను అలా స్కూటీ బండిపై తిప్పుతానని తీసుకెళ్లాడు.. వెంటూరు నుంచి రామచంద్రపురం మండల పరిధిలోని నెలపర్తిపాడు వరకు తీసుకుని వచ్చాడు.. తండ్రి రాజు మనసులో కుట్రను తెలుసుకోలేని చిన్నారులిద్దరూ సంతోషంతో స్కూటీ ఎక్కి సరదాగా తిరిగారు... చీకటి పడేదాకా వారిని అటు ఇటూ తిప్పిన తండ్రి రాజునెలపర్తిపాడులోని గణపతిలాకుల వద్దకు తీసుకుని వెళ్లాడు.. అక్కడ నిర్మాణుష్యంగా ఉండడం చూసి ఇద్దరి పిల్లల్ని ఒక్కసారిగా కాలువలోకి తోసేశాడు.. అయితే కాలువలో అంత ఉదృతంగా ప్రవాహం లేకపోవడంతో కుమారుడు సందీప్ ఈతకొట్టుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ చిన్నారి కారుణ్య మాత్రం కనిపించలేదు.. దీంతో గట్టుమీదనుంచి ఏడుస్తూ నడుస్తున్న సందీప్‌ను చూసిన ఇద్దరు స్థానికులు తమ వెంటబెట్టుకుని రామచంద్రపురం పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు..
తెల్లారేసరికి చిన్నారి విగతజీవిగా..
హుటాహుటీన పోలీసులు బాలుడు సందీప్ చెప్పిన వివరాల ప్రకారం గణపతి లాకుల వద్దకు వెళ్లి పరిశీలించగా చిన్నారి కారుణ్య ఆచూకీ లభించలేదు.. ఉదయంకు కారుణ్య మృతదేహం లభ్యం అయ్యింది.. తమను స్కూటీపై లాకుల వద్దకు తీసుకువచ్చిన తండ్రి ఆతరువాత ఏమయ్యాడో తెలియదని బాలుడు సందీప్ పోలీసులకు తెలిపాడు. అయితే తండ్రి రాజు పిల్లల్ని కాలువలోకి తోసేసి ఎక్కడికైనా పరారయ్యాడా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు..
కన్నీరుమున్నీరైన తల్లి, కుటుంబసభ్యులు..
కన్నతండ్రే చిన్నారుల పాలిట కాలయముడయ్యాడన్న వార్త తల్లి, కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరు మున్నీరయ్యారు. చిన్నారి కారుణ్య మృతదేహం వద్ద తల్లి, కుటుంబికులు విలపించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది. ఏమైనా ఉంటే తాను చూసుకోవాలని కానీ అన్యంపుణ్యం ఎరగని పసిపిల్లలు ఏం చేశారని కసాయి తండ్రి రాజు తీరుపై మండిపడ్డారు.. అయితే తండ్రి రాజు ఆచూకీ ఇంకా లభ్యం కాకపోగా అతని సెల్ ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఈసంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

