Ranya Rao: కన్నడ హీరోయిన్ రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తెలుగు హీరో అరెస్ట్... వెలుగులోకి సంచలన నిజాలు
Ranya Rao : కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉందంటూ తెలుగు నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, సంచలన నిజాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.

కన్నడ హీరోయిన్ రన్యా రావు దుబాయ్ నుంచి అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఇందులో కీలక పాత్ర పోషించాడు అంటూ తెలుగు హీరో తరుణ్ రాజ్ కొండూరును పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.
పోలీసుల అదుపులో తెలుగు నటుడు
దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రన్యా రావు గురించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. కేవలం 15 రోజుల్లోనే నాలుగు సార్లు దుబాయ్ వెళ్లి వచ్చిన ఆమెపై నిఘా ఉంచి మరీ పోలీసులు పట్టుకున్నారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన రన్యా రావును అట్నుంచి అటే పోలీసులు అరెస్ట్ చేసి, అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర రూ.12.56 కోట్ల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆమెను రిమాండ్ కు తరలించగా, ఈ కేసులో కీలకపాత్ర ఎవరిది? అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే తాజాగా తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరును అదుపులోకి తీసుకొని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.
ఈ కేస్ తో సంబంధం ఉందంటూ తెలుగు హీరో తరుణ్ రాజ్ కొండూరును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. తరుణ్ 'పరిచయం' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటిదాకా తరుణ్ రాజ్ అలియాస్ విరాట్ కొండూరు రాజ్ మూడు తెలుగు సినిమాల్లో నటించాడు. 2018లోనే నటుడిగా కెరీర్ ని ప్రారంభించిన తరుణ్ రాజ్ అసలు పేరు ఇది కాదు. సినిమాల్లోకి రాకముందు అతని పేరు విరాట్ కొండూరు రాజ్. ఇక తరుణ్ రన్యాకు చాలా సన్నిహితుడని, ఇద్దరి మధ్య స్నేహం ఉండడంతో ఈ స్మగ్లింగ్ రాకెట్ లో అతని పాత్ర ఏంటి అనే విషయాన్ని క్షుణ్ణంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హై ప్రొఫైల్ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
దర్యాప్తులో బయటపడ్డ కీలక విషయాలు
ఈ నేపథ్యంలోనే దర్యాప్తులో సహ నిందితుడైన తరుణ్ రాజ్ కొండూరు అమెరికా పాస్పోర్ట్ ను ఉపయోగించి బంగారాన్ని బదిలీ చేసినట్టు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కోర్టులో కొన్ని ప్రత్యేక పత్రాలను సమర్పించింది. అందులో యూఏఈ సందర్శించినప్పుడు దుబాయిలో రన్యా రావు ఇచ్చిన కస్టమ్స్ డిక్లరేషన్లలో బంగారాన్ని జెనీవాకు తరలిస్తున్నట్టు పేర్కొన్నట్టు వెల్లడించారు.
మార్చ్ 3 నుంచి 9 మధ్య జరిగిన దర్యాప్తులో దుబాయ్ లో బంగారాన్ని స్మగ్లింగ్ చేయడంలో తరుణ్ కు చెందిన యూఎస్ పాస్పోర్ట్ ను కీలక సాధనంగా ఉపయోగించినట్టు తేలడం గమనార్హం. దుబాయ్ లోని డీలర్ నుంచి బంగారాన్ని కొన్న తర్వాత, ఆ కొనుగోలు పత్రాలను ఉపయోగించి దుబాయ్ లోని తన సహచరుడు తరుణ్ పేరుతో డిక్లరేషన్ చేయించినట్టు విచారణలో తేలింది. ఇక తరుణ్ పేరుతో ఉన్న బంగారాన్ని జెనీవాకు తీసుకెళుతున్నట్టు దుబాయ్ కస్టమ్స్ కు చూపించి, ఇండియాకు తీసుకొచ్చారు. విక్రమ్ కు యూఎస్ పాస్పోర్ట్ ఉండడంతో దుబాయ్ కస్టమ్స్ వద్ద వీసా చట్టంలోని కొన్ని లొసుగులను ఉపయోగించి లైన్ క్లియర్ చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దుబాయ్ లో చెకింగ్ అయిపోయిన తర్వాత రన్యా టాయిలెట్ లో బ్యాండేజ్ తో బంగారు ఆభరణాలను తన ఒంటిపై అంటించుకున్నట్టు విచారణలో వెల్లడించింది అని తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

